Lava Stone : మల్టీపర్పస్ స్టోన్స్‌గా లావా స్టోన్స్ ఎలా ఉపయోగిస్తున్నారంటే ..!
ABN, Publish Date - Feb 22 , 2024 | 01:15 PM
సముద్రపు రంగులు, ప్రశాంతతను ఇంటికి తీసుకురావాలంటే అక్వేరియాన్ని అందంగా మార్చడమే. రకరకాల చేపలు, మొక్కలతో అలంకరణలతో నింపేసే విధంగా తొట్టెలో లావారాక్ ఉంచితే నీరు పరిశుభ్రంగా ఉండటమే కాదు, ఈ రాయి మీద బ్యాక్టీరియా పెరగడానికి సహకరిస్తుంది. నీటిని ఫిల్టర్ చేయడానికి, శుభ్రంగా ఉంచడానికి సహకరిస్తుంది.
లావా రాళ్ళు చల్లబడిన తర్వాత ఏర్పడే ఒక రకమైన శిల. ఇది విపరీతమైన ఉష్ణోగ్రత మీద వేడి కాబడి, లావా కరిగి చల్లారాకా గట్టి రాయిలా ఏర్పడుతుంది. సాధారణం 1200 డిగ్రీల సెల్సియస్ వరకూ వేడవుతుంది. ఈ లావా శిలలు బసాల్ట్ అని పిలవబడే ఒక రకమైన ఇగ్నియస్ రాక్. ఇది ఖనిజాలు, రసాయన మూలకాలుతో కూడి ఉంటుంది. ఈ రాళ్లను రకరకాల విధాలుగా ఉపయోగిస్తారు. తోటలో, ఇంటి అలంకరణకు, అంతే కాదు లావా రాళ్లను పూసలుగా చేసి ఆభరణాలలో కూడా ఉపయోగిస్తారు. ల్యాండ్ స్కేపింగ్ గా ఉపయోగిస్తారు. దైనందిన జీవితంలో ఈ లావా శిలలను ఉపయోగిస్తున్నారు.
లావా రాళ్ళను తోటకు అందాన్ని తెచ్చే విధంగా అవర్చుతారు. రంగులతో అలంకరిస్తారు, అలాగే మొక్కల చూట్టూ కవచంగా వాడతారు. ఇవి మొక్కలను వేడి, చలి, గాలుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇది తోటలో డ్రైనేజీ సమస్యను కూడా తగ్గిస్తుంది.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..
అక్వేరియంలో..
సముద్రపు రంగులు, ప్రశాంతతను ఇంటికి తీసుకురావాలంటే అక్వేరియాన్ని అందంగా మార్చడమే. రకరకాల చేపలు, మొక్కలతో అలంకరణలతో నింపేసే విధంగా తొట్టెలో లావారాక్ ఉంచితే నీరు పరిశుభ్రంగా ఉండటమే కాదు, ఈ రాయి మీద బ్యాక్టీరియా పెరగడానికి సహకరిస్తుంది. నీటిని ఫిల్టర్ చేయడానికి, శుభ్రంగా ఉంచడానికి సహకరిస్తుంది.
గ్యాస్ బార్బెక్యూలు..
లావా రాళ్ళు వేడిని గ్రహిస్తాయి. ఇవి గ్యాస్ గ్రిల్ ఉంచితే బర్నర్ నుంచి సమాన ఉష్ణాన్ని పంపుతాయి. గ్రిల్ వేడిని పెంచుతాయి. గ్యాస్ గ్రిల్‌లో లావా రాళ్ళను ఉపయోగించడం వల్ల ఆహారాన్ని అతి గా ఉడికించే అవసరం ఉండదు. పైగా గ్యాస్ కలిసి వస్తుంది.
ఇది కూడా చదవండి: వర్షాన్ని గుర్తు చేసే గుబురు పొద గురించిన అద్భుతాలు ఎన్నో.. !!
లావా శిలలు ఫిల్టర్లు..
నీటిని శుభ్రంగా ఉంచేందుకు లావా రాళ్ళు ఉపయోగపడతాయి. నీటిని శుభ్రంగా, స్పష్టంగా ఉంచుతాయి. ఇవి ఆల్కలీన్, కాబట్టి అవి ఆమ్ల నీటిని తటస్తం చేయడానికి సహాయపడతాయి. అన్నింటికంటే ఉత్తమమైన ఈ రాళ్ళు సహజమైన ఉత్పత్తి, కాబట్టి అవి చేపలు, మొక్కలకు సురక్షితంగా ఉంటాయి.
Updated Date - Feb 22 , 2024 | 01:15 PM