Long Weekends: టూర్లు వెళ్లాలని అనుకునేవారికి భలే ఛాన్స్.. వీకెండ్ తో కలిసొచ్చిన సెలవులు ఇవే..!
ABN, Publish Date - Jan 22 , 2024 | 02:45 PM
వారాంతపు సెలవులతో కలసి వచ్చిన ఈ సెలవులలో టూర్లు ప్లాన్ చేసుకుంటే భలే ఎంజాయ్ చెయ్యచ్చు.
కుటుంబ సభ్యులు, స్నేహితులు, లేదంటే సింగిల్ గా అయినా సరే టూర్లు వెళ్లడం కామన్. బిజీ బిజీ జీవితాల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి టూర్లకు వెళ్ళడం చాలా ముఖ్యం కూడా. అయితే సెలవుల విషయంలో చిక్కులు వచ్చి పడతాయి. వరుసగా సెలవులు దొరకడం కష్టం. కానీ హాయిగా అనుకున్న ప్రదేశాలకు నచ్చిన వాళ్లతో వెళ్లిరావచ్చు. వారాంతపు సెలవులతో కలసి వచ్చిన ఈ సెలవులు వరుసగా మూడురోజుల పాటూ ట్రిప్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఏడాదిలో చాలా అరుదుగా ఉండే ఆ సెలవుల లిస్ట్ ఇదీ..
జనవరి 26-28..
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 శుక్రవారం సెలవుదినం. శనివారం ఒక్కరోజు సెలవు సంపాదించుకుంటే చాలు.. శుక్ర, శని, ఆది మూడురోజులు హాయిగా ట్రిప్ కు వెళ్లొచ్చు.
ఇది కూడా చదవండి: పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
మార్చి 8-10
మార్చి 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా సెలవు దినం. ఆ తరువాత 9వ తేదీ రెండవ శనివారం. ఇక ఆదివారం ఎలానూ ఉంది. మూడురోజులు నచ్చిన ప్రదేశానికి వెళ్లిరావచ్చు.
మార్చి 23-25
మార్చి 25వ తేదీ సోమవారం రంగుల పండుగ హోలీ సెలవు దినం. దీనికి ముందు ఆదివారం ఎలాగూ ఉంటుంది. శనివారం ఒక్కరోజు వీలు చూసుకుంటే మూడురోజులు ముచ్చటగా మంచి టూర్ ను ఎంజాయ్ చేయవచ్చు.
మార్చి 29-31
మార్చి నెలలోనే మరొక అవకాశం ఇది. మార్చి 29శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవు దినం. తరువాత శనివారం రోజు వీలు చూసుకుంటే చాలు. మూడు రోజుల ట్రిప్ వెళ్లడానికి వీలవుతుంది.
ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే వీటిని తప్పక తినాల్సిందే..!
మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 22 , 2024 | 02:45 PM