ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Black tiger Safari: ఈ విషయం తెలిస్తే వెంటనే ఒడిశా టూర్ ప్లాన్ చేస్తారు! ప్రపంచంలోనే తొలిసారిగా..

ABN, Publish Date - Jan 29 , 2024 | 06:46 PM

ప్రపంచంలోని తొలి బ్లాక్ టైగర్ సఫారీ త్వరలో ఒడిశాలో ప్రారంభం కానుంది. మయూర్‌భంజ్‌లోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సఫారీ ప్లాన్ చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే తొలి బ్లాక్ టైగర్ సఫారీ (World's first black tiger safari) త్వరలో ఒడిశాలో (Odisha) ప్రారంభం కానుంది. మయూర్‌భంజ్‌లోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌లో (Simlipal tiger reserve) రాష్ట్ర ప్రభుత్వం ఈ సఫారీ ప్లాన్ చేస్తోంది. సాధారణ పులులతో పోలిస్తే నల్లని, దట్టమైన చారలు ఉండే ఈ పులులను శాస్త్రపరిభాషలో మెలనిస్టిక్ టైగర్స్ అని పిలుస్తారు. సఫారీకి సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ఎక్స్ వేదికగా వెల్లడించారు.

మొత్తం 200 ఎకరాల్లో ఈ సఫారీని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సగం స్థలంలో పర్యాటకులను సఫారీకి అనుమతిస్తారు. మిగిలిన సగం స్థలంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పశువైద్యశాల, సిబ్బందికి నివాసాలు, పర్యాటకుల సౌకర్యాలు మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రంలోని జీవవైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేయటమే ఈ సఫారీ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాటూ వణ్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను కూడా తెలియజెప్పడం మరో ప్రధాన ఉద్దేశమని అంటోంది. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌లో మూడు బ్లాక్ టైగర్లు ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు ఇంకొన్ని అనుమతులు రావాల్సి ఉంది. సఫారి కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం అనువైనదా? కాదా? అనేది తేల్చేందుకు నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ సర్వే చేపట్టాలి. సెంట్రల్ జూ అథారిటీ అనుమతి కూడా పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యాక ప్రకృతిప్రేమికులు ఓడిశాకు క్యూ కడతారనడంలో ఎటువంటి సందేహం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 29 , 2024 | 07:08 PM

Advertising
Advertising