ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Republic Day 2024: గణతంత్ర దినోత్సవం 2024 థీమ్ ఏంటి? ముఖ్య అతిథి ఎవరు?

ABN, Publish Date - Jan 16 , 2024 | 02:41 PM

యావత్ భారతావని గణతంత్ర వేడుకలు (Republic Day 2024) ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఢిల్లీలో జరగనున్న వార్షిక వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజులపాటు జరుగుతాయి.

ఢిల్లీ: యావత్ భారతావని గణతంత్ర వేడుకలు (Republic Day 2024) ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఢిల్లీలో జరగనున్న వార్షిక వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజులపాటు జరుగుతాయి. జనవరి 29న బీటింగ్ రిట్రీట్ వేడుకతో ముగుస్తాయి. గణతంత్ర దినోత్సవం గురించి చాలా మందికి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. వాటికి సమాధానాలు తెలుసుకుందాం.

గణతంత్ర దినోత్సవం ఎందుకు..

భారత్ ఆగష్టు 15, 1947న బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందింది. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

పరేడ్‌లో ఏం చేస్తారు..

ఏటా గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో అద్భుతమైన సైనిక కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక సంస్కృతి ఇందులో ప్రతిబింబిస్తుంది. వేడుకలు చూసేందుకు ప్రధాని, కేంద్ర మంత్రిమండలితో సహా అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతారు. ఈ సందర్భంగా చేపట్టే శకటాల ప్రదర్శన రోజుకే హైలెట్ గా నిలుస్తుంది. కవాతు రాష్ట్రపతి భవన్ (ప్రెసిడెంట్ ప్యాలెస్) సమీపంలోని రైసినా హిల్‌లో ప్రారంభమై, ఇండియా గేట్ నుంచి ఎర్రకోట వరకు సుమారు 5 కి.మీ.మేర సాగుతుంది.


ఈ ఏడాది ముఖ్య అతిథి ఎవరు?

భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి. గతేడాది ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సీసీ హాజరయ్యారు.

2024 కవాతు ప్రత్యేకత ఏంటి?

ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయనున్నాయి. "144 మంది సిబ్బందితో కూడిన ఒక బృందంలో మొత్తం మహిళా సైనికులు ఉంటారు, ఇందులో 60 మంది ఆర్మీకాగా మిగిలినవారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన వారు" అని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

థీమ్ ఏంటి?

2024 రిపబ్లిక్ డే థీమ్ ''India – Mother of Democracy'', ''విక్షిత్ భారత్'' (అభివృద్ధి చెందిన భారతదేశం).

మొదటి ముఖ్య అతిథి ఎవరు?

ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్ణో జనవరి 26, 1950న భారత్ మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు మొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated Date - Jan 25 , 2024 | 05:07 PM

Advertising
Advertising