నేడు మీ రాశి ఎలా ఉందో ఓ సారి చూసుకోండి..
ABN, Publish Date - Feb 12 , 2024 | 07:16 AM
నేడు (12-2-2024 - సోమవారం ) కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.
నేడు (12-2-2024 - సోమవారం ) కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించి రహస్య సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. సినీ, రాజకీయ, న్యాయ, బోధన, విదేశీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ, న్యాయ రంగాల వారు ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దల సహకారంతో ఆర్థిక వ్యవహరాల్లో లక్ష్యాలు సాధిస్తారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులు పూర్తవుతాయి. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఽప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు సాధిస్తారు. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. గౌరవ పదువులు అందుకుంటారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
స్టాక్‌మార్కెట్ లావాదేవీల పై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నులు, మ్యూచ్యువల్ పండ్స్, పెన్షన్ లావాదేవీలకు అనుకూలం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. హోటల్, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విద్యా సంస్థలు, చిట్ఫండ్లు, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులకు శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు రవాణాకు అనుకూలం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. సోదరీ సోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలకు ఏర్పాట్లు చే సుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువుల కొనుగోలు కోసం ఆరా తీస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. దుర్గామాతను ఆరాధించండి.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. దూరంలో వున్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Feb 12 , 2024 | 07:16 AM