Car Summer Tips: కారులో ఈ వస్తువుల్ని అస్సలు ఉంచొద్దు.. తస్మాత్ జాగ్రత్త!
ABN, Publish Date - Mar 13 , 2024 | 03:32 PM
వేసవికాలంలో (Summer) ఎండలు ఎలా మండిపోతాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదేదో జన్మజన్మల శత్రుత్వం అన్నట్టు.. సూర్యుడు మనపై ప్రతాపం చూపిస్తాడు. భగభగమండే మంటలతో మనల్ని ముప్పుతిప్పలు పెడతాడు. ఈ సూర్యుడి ప్రతాపానికి కొన్నిసార్లు వాహనాలు కూడా తగలబడిపోతుంటాయి. ముఖ్యంగా.. కార్లలో అగ్నిప్రమాదాలు (Car Incidents) చోటు చేసుకుంటాయి.
వేసవికాలంలో (Summer) ఎండలు ఎలా మండిపోతాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదేదో జన్మజన్మల శత్రుత్వం అన్నట్టు.. సూర్యుడు మనపై ప్రతాపం చూపిస్తాడు. భగభగమండే మంటలతో మనల్ని ముప్పుతిప్పలు పెడతాడు. ఈ సూర్యుడి ప్రతాపానికి కొన్నిసార్లు వాహనాలు కూడా తగలబడిపోతుంటాయి. ముఖ్యంగా.. కార్లలో అగ్నిప్రమాదాలు (Car Incidents) చోటు చేసుకుంటాయి. కార్లను ఎండలో నిలిపినప్పుడు.. ఒక్కసారిగా మంటలు చెలరేగి, అద్దాలు బద్దలవ్వడం వంటి సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి.
ఇప్పుడు మళ్లీ వేసవి కాలం వచ్చింది కాబట్టి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి.. వేసవికాలంలో కార్లలో అగ్నిప్రమాదాలు సంభవించడానికి, మనం పట్టించుకోని కొన్ని విషయాలే కారణమని వాళ్లు చెప్తున్నారు. సన్ గ్లాసెస్ దగ్గర నుంచి మద్యం సీసాల దాకా.. మనం కార్లలో పెట్టే వస్తువులు ప్రమాదానికి కారణమవుతాయని అంటున్నారు. వీటిని మనం కార్లలో పెట్టడం మానెయ్యడంతో పాటు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. ఇటువంటి ప్రమాదాల్ని నివారించవచ్చని పేర్కొంటున్నారు.
ఇంతకీ ఆ వస్తువులు ఏమిటంటే..
* సన్‌గ్లాసెస్ (Sun Glasses): చాలామంది సన్‌గ్లాసెస్‌ని డ్యాష్‌బోర్డుపైనే వదిలేస్తారు. అప్పుడు కారు ఎండలో ఉండే.. అవి భూతద్దంలా పనిచేసి, అగ్ని ప్రమాదానికి కారణమవుతాయి.
* లైటర్స్ (Lighters): కార్లలో లైటర్స్‌ని ఏమాత్రం వదిలిపెట్టకూడదు. ఒకవేళ కారుని ఎక్కువసేపు ఎండలో ఉంచితే.. ఆ లైటర్స్ నుంచి మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది.
* బ్యాటరీస్ (Batteries): కార్లలో కొత్త లేదా పాత బ్యాటరీల్ని ఉంచితే.. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద అవి లీక్ అవ్వొచ్చు. వాటిల్లో ఉండే యాసిడ్లు ఎంతో విషపూరితమైనవి.
* శానిటైజర్లు (Sanitisers): కొవిడ్ నుంచి చాలామంది శానిటైర్లను ఉపయోగిస్తున్నారు. అయితే.. అందులో ఉండే ఆల్కహాల్, అధిక ఉష్ణోగ్రత వద్ద మంటలను సృష్టిస్తాయి.
* మేకప్ కిట్ (Makeup Kit): మేకప్ సామాగ్రిలో మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వాటిని వాహనాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచొద్దని నిపుణులు తెలుపుతున్నారు.
* స్ప్రే క్యాన్స్ (Spray Cans): వీటిల్లో స్పిరిట్ ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ.. ఆ క్యాన్లలో ఒత్తిడి పెరిగి, పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. వీటిని కారులో ఏమాత్రం ఉంచొద్దు.
* మద్యం సీసాలు (Alcohol Bottles) : మద్యం సీసాలు కార్లలో ఉంచి, ఎండలో పార్క్ చేస్తే ఎంతో ప్రమాదకరం. అవి పేలే ప్రమాదం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 13 , 2024 | 03:32 PM