ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఈ 22 ఏళ్ల యువతి కొన్ని సంవత్సరాలుగా స్నానం చేయలేదు.. కారణం ఏంటో తెలిస్తే..!

ABN, Publish Date - Mar 06 , 2024 | 04:21 PM

మెడిసిన్ ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొన్ని వ్యాధులకు చికిత్స లేదు. అమెరికాకు చెందిన ఓ 22 ఏళ్ల యువతి అలాంటి అరుదైన సమస్యతోనే బాధపడుతోంది.

ఈ ప్రపంచంలో ఎంతో మంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. విచిత్రమైన వ్యాధులతో (Rare Health Condition)సతమతమవుతుంటారు. మెడిసిన్ ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొన్ని వ్యాధులకు చికిత్స లేదు. అమెరికాకు (America) చెందిన ఓ 22 ఏళ్ల యువతి అలాంటి అరుదైన సమస్యతోనే బాధపడుతోంది. ఆ యువతిని వాటర్ అలెర్జీ (Water Allergy) వేధిస్తోంది. దీంతో ఆమె ఎన్నో సంవత్సరాలుగా స్నానం చేయడం మానేసింది.

అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన 22 ఏళ్ల మోంటెఫ్యూసో అనే యువతికి కొన్నేళ్ల కిందట ఏదో అసౌకర్యంగా అనిపించడంతో, ఆమె డాక్టర్ వద్దకు వెళ్లింది. హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత ఆమె తన సమస్య గురించి తెలుసుకుంది. స్నానం చేసిన తర్వాత ఆమె చర్మంపై విపరీతమైన దురద మొదలవుతుంది. దద్దుర్లు వస్తాయి. స్నానం చేసిన తర్వాత తరచుగా ఈ సమస్య రావడంతో ఆమె డాక్టర్‌ను కలిసింది. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు వాటర్ అలెర్జీ అని తేల్చారు. స్నానం మాత్రమే కాదు.. నీటిని ముట్టుకుంటే చాలు ఆమె పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది.

తన ఆరోగ్య సమస్య తెలుసుకున్న మోంటోఫ్యూసో స్నానానికి దూరమైంది. తనను తాను శుభ్రంగా ఉంచుకోవడానికి ఆమె డ్రై షాంపూ, బాడీ వైప్‌లను ఉపయోగిస్తుంటుంది. ``నా సమస్య విని షాకయ్యాను. ఇంటర్నెట్‌లో చూస్తే నాలాంటి సమస్యతో బాధపడుతున్న వారు మెడికల్ రికార్డుల ప్రకారం మరో 37 మంది ఉన్నట్టు తెలిసింది. మా సమస్యకు చికిత్స లేకపోవడం అత్యంత బాధాకరం`` అని మోంటిఫ్యోసో పేర్కొంది.

Updated Date - Mar 06 , 2024 | 04:45 PM

Advertising
Advertising