ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ViralVideo: మా అమ్మ ఎవరికీ భయపడొద్దంది..బుడ్డోడి ఆన్సర్‌కు టీచర్ షాక్!

ABN, Publish Date - Feb 03 , 2024 | 08:44 PM

టీచర్లు తిట్టడం, స్టూడెంట్లకు కోపాలు రావడం కామనే! క్లాస్ రూముల్లో నిత్యం కనిపించే దృశ్యమే! కానీ కొన్ని సందర్భాల్లో విద్యార్థుల ఆగ్రహం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది. ఇలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: టీచర్లు తిట్టడం, స్టూడెంట్లకు కోపాలు రావడం కామనే! క్లాస్ రూముల్లో నిత్యం కనిపించే దృశ్యమే! కానీ కొన్ని సందర్భాల్లో విద్యార్థుల ఆగ్రహం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది. ఇలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ వీడియోలోని బుడ్డోడిని హోం వర్క్ సరిగా ఎందుకు చేయలేదని టీచర్ గద్దించింది. కాసేపు చిన్నోడు టీచర్ కేసి బిక్క మొహంతో చూశాడు. కానీ, టీచర్ పదే పదే తిడుతుంటే మనోడు కంట్రోల్ తప్పిపోయాడు. ఇంతకంటే ఏం చేయాలి, నిన్నంతా మా అమ్మ హోం వర్క్ తెగ చేయించి నా బుర్ర పోయేలా చేసింది’’ అంటూ ఏడుస్తూ టీచర్‌కు సమాధానం ఇచ్చాడు.

అయితే, టీచర్ మాత్రం అతడికి ఎలాగైనా లెక్కలు నేర్పించాలన్న ఉద్దేశంతో సరిగా చేయమని మరోసారి కసురుకుంది. దీంతో, బుడ్డోడిలో కోపం కట్టలు తెంచుకుంది. టీచర్ మాటల్నీ లెక్కచేయకుండా గయ్యిమన్నాడు. ‘‘మా అమ్మ ఎవరికీ భయపడొద్దంది’’ అంటూ హీరో లెవెల్లో గర్జించాడు. పక్కనున్న ఇతర టీచర్లు ఇదంతా చూసి గొల్లున నవ్వారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లాడి కోపం చూసి జనాలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఆధునిక చదువుల పుణ్యమా అని చిన్నతనం నుంచే పిల్లల్లో ఒత్తిడి మొదలవుతోందని మరికొందరు కామెంట్ చేశారు.

Updated Date - Feb 03 , 2024 | 08:50 PM

Advertising
Advertising