ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vinod Channa: అనంత్ అంబానీ బరువును ఐస్ లా కరిగించిన ఫిట్నెస్ ట్రైనర్ ఇతనే.. ఇతని గతం ఏంటో తెలిస్తే షాకవుతారు!

ABN, Publish Date - Jan 17 , 2024 | 10:17 AM

18నెలలో 108కేజీల బరువు తగ్గించి అనంత్ అంబానీ కటౌట్ మార్చిన వినోద్ చన్నా గతంలో ఏం చేసేవాడో తెలిస్తే షాకవుతారు.

అనంత్ అంబానీ.. భారతీయ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడిగా అందరికీ ఎంత తెలుసో.. అధిక బరువుతో ఇబ్బంది పడిన వ్యక్తిగా ఫిట్నెస్ ప్రపంచానికి అంతకంటే ఎక్కువ తెలుసు. అయితే తాజాగా అనంత్ అంబానీ(Anant Ambani) తన బరువు తగ్గించుకుని స్లిమ్ లుక్ తో ఫిట్నెస్ ప్రపంచానికి షాకిచ్చారు. దీని వెనుక ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా(Mumbai Famous Fitness Trainer Vinood Channa) ఉన్నారు. ముంబైకి చెందిన ఈ ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ 18నెలలో ఏకంగా 108 బరువును తగ్గించగలిగారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఈయన వైపు మళ్లింది. కానీ వినోద్ చన్నా గతంలో పోషకాహార లోపంతో బాధపడిన వ్యక్తి అని తెలిస్తే మాత్రం షాకవుతారు. ఈయన గురించి మరింత విపులంగా తెలుసుకుంటే..

ప్రతి వ్యక్తి ఒక రంగాన్ని ఎంచుకోవడానికి, అందులో రాణించడానికి కొన్ని పరిస్థితులు ప్రభావితం చేసి ఉంటాయి. వినోద్ చన్నా ఫిట్నెస్ వైపు రావడానికి గల ప్రధాన కారణం అతని శరీరమే.. జిమ్ లో కసరత్తులు చెయ్యాలని, బాడీ బిల్డింగ్ చెయ్యాలని ప్రయత్నిస్తూ ఫిట్నెస్ ట్రైనర్లుగా మారినవారు చాలామంది ఉంటారు. కానీ వినోద్ ఖన్నా ఇందుకు పూర్తీగా విభిన్నం. ఆహారం సరిగా తీసుకోకపోవడం, జీవనశైలి పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈయన పోషకాహార లోపంతో బాధపడ్డారు. ఫిట్నెస్ శిక్షణలోకి రాకముందు హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డుతో సహా చాలా రకాల ఉద్యోగాలు చేశారు.

ఇది కూడా చదవండి: Viral: మీ కంటిచూపు పదునెంత? 5 సెకెన్లలో ఈ ఫోటోలో పిల్లిని కనిపెడితే మీ చూపు భేష్..!



ఎన్ని ఉద్యోగాలు చేసినా ఆరోగ్యం బాగాలేకుంటే అంతా వ్యర్థమే అనే విషయం అర్థమైన తరువాత వినోద్ చన్నా జిమ్ కు వెళ్లాడు. అదే ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. తను తన శరీరాన్ని దృఢంగా మార్చుకోవడమే కాకుండా ఇతరులకు తర్పీదు ఇవ్వడం ద్వారా ఫిట్నెస్ శిక్షకుడిగా డబ్బు కూడా సంపాదించడం మొదలు పెట్టాడు. ఇక అనంత్ అంబానీ బరువు తగ్గిన విషయం గురించి చెబుతూ.. అనంత్ అంబానీకి అతిగా తినడం, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి అలవాట్ల కారణంగా బరువు తగ్గడంలో పెద్ద సవాల్ ఎదురైందని, అనంత్ అంబానీ కమిట్మెంట్ కారణంగా ఇది సాధ్యమైందని తెలిపారు. అనంత్ అంబానీ డైట్ లో తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను అవాయిడ్ చేసి, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారాలను డైట్ లో ఉండేలా ప్లాన్ చేశారని చెప్పారు.

ఇది కూడా చదవండి: వాము గింజల నీటిని తాగితే.. కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!

ఇకపోతే వినోద్ చన్నా సెలబ్రిటీలకు తన సేవలు అందిస్తున్నారు. ఈయన నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా వంటి ప్రముఖ వ్యాపారవేత్తలకే కాకుండా జాన్ అభ్రహం, శిల్పాశెట్టి, హర్షవర్దన్ రాణే, వివేక్ ఒబేరాయ్, అర్జున్ రాంపాల్ తో సహా బోలెడు బాలీవుడ్ ప్రముఖులకు వ్యక్తిగత శిక్షకుడిగా ఉన్నాడు. ఈయన 12సెషన్ల ప్యాకేజీకి రూ. 1.5లక్షల రూపాయలు వసూలు చేస్తారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 17 , 2024 | 10:19 AM

Advertising
Advertising