40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఐఐఎంలో చదువుతున్న కొడుకుకు ఉత్తరం రాసిన తల్లి.. అందులో ఆమె కొడుకుకు ఇచ్చిన సలహాలేంటంటే..!

ABN, Publish Date - Jan 30 , 2024 | 12:42 PM

ఐఐఎం చదువుతున్న కొడుకుకు ఓ తల్లి ఇచ్చిన సలహాలు ఇవీ..

Viral: ఐఐఎంలో చదువుతున్న కొడుకుకు ఉత్తరం రాసిన తల్లి.. అందులో ఆమె కొడుకుకు ఇచ్చిన సలహాలేంటంటే..!

పిల్లలు బాగా చదువుకుని విద్యావంతులు కావాలని, వారు ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ప్రతి తల్లిదండ్రులు కలగంటారు. దానికి తగినట్టే పిల్లల మీద ఎనలేని ప్రేమ ఉన్నా వారిని దూరం పంపి బాగా చదివిస్తారు. ఓ తల్లి తన కొడుకును ఐఐఎంకు పంపింది. అయితే ఆమె తన కొడుకుకు కొన్ని సలహాలు ఇస్తూ ఉత్తరం రాసింది. ప్రస్తుతం ఈ ఉత్తరం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

ఇప్పుడంటే ఫోన్లు చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ 2007నాటికి ఫోన్లు చాలా తక్కువ. చిన్నపాటి కీప్యాడ్ మొబైల్స్ మాత్రమే ఉండేవి అప్పటికి. అవి కూడా అరుదుగానే ఉండేవి. 2007 లో ఓ తల్లి ఐఐఎంలో చదువుతున్న తన కొడుకుకు ఉత్తరం రాసింది. తమిళ భాషలో సాగిన ఈ ఉత్తరంలో ఇంటికి రమ్మని చెప్పడమే కాకుండా చదువు మీద ఏకాగ్రత పెట్టమని, సమయాన్ని వృథా చేయద్దని కొడుకుకు సలహా ఇచ్చింది. అదే విధంగా దేవుడిని భక్తిగా తలచుకోమని, ప్రతి బుధవారం గాయత్రీ మంత్రం జపించమని, మీ నాన్న ఇక్కడ బానే ఉన్నారని ఉత్తరంలో రాసింది. పిల్లలు ఎంత పెద్దవాళ్లు అయినా , ఎంత ఉన్నత చదువులు చదవడానికి వెళ్లినా తల్లికి పిల్లల మీద ప్రేమ అలానే ఉంటుందనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు ఈ ఉత్తరం చూసిన పలువురు నెటిజన్లు. చాలామంది తాము చదువుకుంటున్న రోజుల్లో తల్లిదండ్రులు రాసే ఉత్తరాల కోసం ఎదురుచూడటం, ఉత్తరాల సారాంశం వంటి విషయాలను గుర్తుచేసుకున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:42 PM

Advertising
Advertising