Viral: ఏంటీ.. చేత్తో అన్నం తినడం తప్పా? ఓ మహిళ చేత్తో అన్నం తిన్నందుకు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఇదీ..!
ABN, Publish Date - Jan 11 , 2024 | 02:26 PM
ఎవరైనా ఆహారాన్ని చేత్తో తింటుంటే కొందరు అనాగరికులను చూసినట్టు చూస్తారు. ఓ మహిళ చేత్తో తినడం వల్ల ఇప్పుడు అదే జరిగింది.
ఆహారమే ఔషదం అని వైద్యశాస్త్రం చెబుతుంది. ఆహారాన్ని తీసుకునే విధానం కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. భారతీయులు ఆహారాన్ని చేత్తో తింటారు. ఇలా తినడం వల్ల చేతి వేళ్ల నుండి మెదడుకు సిగ్నల్స్ వెళతాయని, తద్వారా ఆహారం గురించి అవగాహన, అనుభూతి చెందుతామని ఆయుర్వేదం చెబుతుంది. కానీ చేత్తో కాకుండా స్పూన్లతో తినడం ఇప్పట్లో ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా చేత్తో తింటుంటే కొందరు అనాగరికులను చూసినట్టు చూస్తారు. ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్లు, రెస్టారెంట్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. కానీ కొందరి అలవాటు కారణంగా చేత్తోనే తింటారు. ఓ మహిళ విమానాశ్రయంలో చేత్తో అన్నం తింటుంటే వీడియో తీసి ఓ ఫారినర్ విమర్శలు ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో భారతీయులు భగ్గుమంటున్నారు. దీని గూర్చి పూర్తీగా తెలుసుకుంటే..
భారతీయులు చాలావరకు ఆహారాన్ని చేత్తోనే తింటారు. ముఖ్యంగా అన్నాన్ని చేత్తో బాగా కలిపి తింటేనే దాని రుచి పెరుగుతుంది. ఓ మహిళ విమానాశ్రయంలో చేత్తో అన్నం తింటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేలసం 4సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మహిళ ప్లేట్ లో అన్నం కలుపుతూ కనిపిస్తుంది(Women eating food with hands). ఆమె తింటున్న ప్లేస్ పక్కనే ఉన్న ఒక వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'అసహ్యాకరమైన విమానాశ్రయంలో ఈ మహిళ తన చేతులతో తింటూ నా ప్రక్కన ఎందుకు కూర్చుంది?' అంటూ తింటున్న మహిళ ఏదో తప్పు చేసినట్టు క్యాప్షన్ మెన్షన్ చేసి మరీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళ వ్యక్తిగత భద్రత దృష్ట్యా ముఖం కనపడకుండా స్కెచ్ తో కవర్ చేశారు.
ఇది కూడా చదవండి: Anand Mahindra: అయ్యబాబోయ్.. ఈ కుర్రాడి కడుపులో ట్రాక్టర్ ఏమైనా ఉందా? ఇతని ట్యాలెంట్ కు ఆనంద్ మహీంద్రా ఫిదా..!
ఈ వీడియోను JusB అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఆమె మెన్షన్ చేసిన కామెంట్ చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఆమె చెయ్యి, ఆమె నోరు, ఆమె ఇష్టం.. ఆమె ఎలా తింటే మీకేంటి?' అని ఒకరు కామెంట్ చేశారు. 'మీ తల్లిదండ్రులు మీకు సంస్కారం నేర్పలేదా? ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం సభ్యత కాదు' అని మరొకరు చురకలు అంటించారు. 'ప్రపంచంలో ఉన్న ఎన్నో సంస్కృతులలో ఆహారాన్ని చేత్తో తింటారనే విషయాన్ని మర్చిపోయారా?' అంటూ మరొకరు విభిన్న సంస్కృతులను గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: 30ఏళ్ల తర్వాత బలంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాల లిస్ట్ ఇదీ..!
Updated Date - Jan 11 , 2024 | 02:28 PM