ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మలుపు తిరిగిన రెజ్లింగ్‌ రగడ

ABN, Publish Date - Jan 04 , 2024 | 01:53 AM

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) వివాదం బుధవారం అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు దేశ అగ్రశ్రేణి రెజ్లర్లంతా సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌, సస్పెండైన కొత్త కార్యవర్గం...

  • సీనియర్లపై జూనియర్ల తిరుగుబాటు

  • కార్యవర్గాన్ని పునరుద్ధరించాలని అల్టిమేటం

  • లేదంటే అవార్డులు వెనక్కి ఇస్తామని హెచ్చరిక

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) వివాదం బుధవారం అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు దేశ అగ్రశ్రేణి రెజ్లర్లంతా సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌, సస్పెండైన కొత్త కార్యవర్గం అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగగా..తాజాగా వినేశ్‌, సాక్షి, బజ్‌రంగ్‌ పూనియాపై జూనియర్‌ రెజ్లర్లు వ్యతిరేక గళమెత్తారు. రెజ్లింగ్‌ సమాఖ్య గొడవలతో ఏడాదంతా నష్టపోయామని, అందుకు బజ్‌రంగ్‌, సాక్షి, వినేశ్‌ కారణమని ఆరోపిస్తూ జంతర్‌ మంతర్‌ వద్ద మూడు గంటలపాటు నిరసనకు దిగారు. ఉత్తరప్రదేశ్‌, హరియాణా, ఢిల్లీ నుంచి దాదాపు 300మంది జూనియర్‌ రెజ్లర్లు బస్సుల్లో ధర్నాకు తరలివచ్చారు. స్టార్‌ రెజ్లర్లకు వ్యతిరేకంగా నినదిస్తూ వచ్చిన వారిని అడ్డుకోవడం పోలీసులకు కష్టతరమైంది. ఢిల్లీలో చలి తీవ్రంగా ఉన్నా లెక్క చేయని రెజ్లర్లు ఉదయం 11 నుంచి 3 గంటలపాటు ధర్నాలో పాల్గొన్నారు. డబ్ల్యూఎ్‌ఫఐపై కేంద్ర ప్రభు త్వం విధించిన సస్పెన్షన్‌ను 10 రోజుల్లోగా ఎత్తివేయకపోతే తమ అవార్డులను వెనక్కిస్తామని వారు హెచ్చరించారు. అలాగే సాక్షి, వినేశ్‌, బజ్‌రంగ్‌ చిత్రాలతో కూడిన ప్లకార్డులను కాళ్లతో తొక్కి ఆగ్రహం ప్రకటించారు. గతనెల 21న ఎన్నికైన డబ్ల్యూఎ్‌ఫఐ కొత్త కార్యవర్గం అండర్‌-15, అండర్‌-20 జాతీయ చాంపియన్‌షి్‌పను మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ స్వస్థలం గోండాలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దాంతో సమాఖ్య రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ గతనెల 24న నూతన కార్యవర్గాన్ని కేంద్ర క్రీడాశాఖ సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఫలితంగా కొత్త కార్యవర్గం నిర్వహించ తలపెట్టిన రెండు టోర్నీలూ రద్దయ్యాయి. ఈనేపథ్యంలో జూనియర్‌ రెజ్లర్లు నిరాశకు లోనయ్యారు. మహిళా రెజ్లర్లను బ్రిజ్‌భూషణ్‌ లైంగికంగా వేధిస్తున్నాడంటూ సరిగ్గా ఏడాది కిందట ఇదే జంతర్‌ మంతర్‌లో టాప్‌ రెజ్లర్లు ఆందోళనకు దిగారు. అప్పట్లో వారికి దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలనుంచి భారీ మద్దతు లభించడం విశేషం.

గ్వాలియర్‌లో జూనియర్‌ చాంపియన్‌షి్‌ప: అండర్‌-15, అండర్‌-20 జాతీయ చాంపియన్‌షి్‌పను ఆరు వారాలలోపు గ్వాలియర్‌లో నిర్వహిస్తామని, నిరసన వ్యక్తంజేస్తున్న రెజ్లర్లు..ఆ పోటీలకోసం సాఽధన చేయాలని అడ్‌హాక్‌ కమిటీ సూచించింది.

మా అమ్మకు బెదిరింపులు సాక్షీ మాలిక్‌

డబ్ల్యూఎ్‌ఫఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ అనుచరులనుంచి తన తల్లికి బెదిరింపులు వస్తున్నాయని సాక్షీ మాలిక్‌ వెల్లడించింది. తమకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పింది. కాగా..సంజయ్‌ సింగ్‌ మినహా సమాఖ్య కొత్త కార్యవర్గం అంతా తమకు ఆమోదయోగ్యమేనని చెప్పింది. ‘రెజ్లింగ్‌కు నేను 18 నుంచి 20 సంవత్సరాలు సేవ చేశా. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులకు గురయ్యానో నాకే తెలుసు. సోషల్‌ మీడియాలో బాగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. జూనియర్‌ రెజ్లర్ల నిరసన గురించి మీడియా ద్వారానే నాకు తెలిసింది. జంతర్‌ మంతర్‌లో ఆందోళన చేసిన వారు అతడి మద్దతుదారులే’ అని సాక్షి చెప్పింది.

Updated Date - Jan 04 , 2024 | 01:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising