రవిశాస్త్రికి ‘లైఫ్‌టైమ్’ అవార్డు
ABN, Publish Date - Jan 23 , 2024 | 06:14 AM
గతేడాది పరుగుల వరద పారించిన డాషింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. కాగా, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, కోచ్ రవిశాస్త్రి జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు..
నేడు హైదరాబాద్‌లో పురస్కారాల ప్రదానం
హైదరాబాద్: గతేడాది పరుగుల వరద పారించిన డాషింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. కాగా, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, కోచ్ రవిశాస్త్రి జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో మంగళవారం ఈ అవార్డుల కార్యక్రమం ఉంటుందని భారత క్రికెట్ బోర్డు తెలిపింది. దీనికి భారత్, ఇంగ్లండ్ టెస్ట్ ఆటగాళ్లు హాజరయ్యే అవకాశాలున్నాయి. 61 ఏళ్ల శాస్త్రి భారత్ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. రిటైరైన తర్వాత టీమిండియా కోచ్, డైరెక్టర్‌గా పనిచేశాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌కు పాలీ ఉమ్రీగర్ అవార్డు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌కు సీకే నాయుడు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
Updated Date - Jan 23 , 2024 | 06:14 AM