ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

world champion : వరల్డ్‌ చాంపియన్‌కు ప్రజ్ఞానంద షాక్‌

ABN, Publish Date - Jan 18 , 2024 | 02:47 AM

టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద రమే్‌షబాబు పెను సంచలనం సృష్టించాడు. టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)కు షాకిచ్చిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద.. దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కునెట్టి

విషీని వెనక్కునెట్టి అగ్రస్థానానికి

విజ్కాన్‌జి (నెదర్లాండ్స్‌): టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద రమే్‌షబాబు పెను సంచలనం సృష్టించాడు. టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)కు షాకిచ్చిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద.. దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కునెట్టి భారత టాప్‌ రేటెడ్‌ ప్లేయర్‌గా నెం:1 స్థానాన్ని ఆక్రమించాడు. మంగళవారం రాత్రి జరిగిన నాలుగో రౌండ్‌లో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 62 ఎత్తుల్లో లిరెన్‌ ఆట కట్టించాడు. ఈ క్రమంలో క్లాసికల్‌ చెస్‌లో ఆనంద్‌ తర్వాత వరల్డ్‌ చాంపియన్‌ను ఓడించిన రెండో భారత ప్లేయర్‌గా ప్రజ్ఞానంద రికార్డులకెక్కాడు. అంతేకాకుండా ఫిడే లైవ్‌ రేటింగ్స్‌లో ఐదుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ విషీ (2748)ను ప్రజ్ఞానంద (2748.3) స్వల్ప తేడాతో అధిగమించాడు. గతేడాది కూడా ఇదే టోర్నీలో లిరెన్‌పై మన చిన్నోడు గెలిచాడు. కాగా, నెదర్లాండ్స్‌ జీఎం అనీష్‌ గిరీ చేతిలో గుకేష్‌ పరాజయం పాలయ్యాడు. టోర్నీలో మొత్తం 4 రౌండ్‌ల నుంచి ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. గుకేష్‌ 1.5 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు. అద్వితీయ విజయం సాధించిన ప్రజ్ఞానందపై సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

Updated Date - Jan 18 , 2024 | 02:54 AM

Advertising
Advertising