Shubman Gill: పుజార వెయిట్ చేస్తున్నాడు.. గిల్‌కు వార్నింగ్ ఇచ్చిన మాజీ కోచ్ రవిశాస్త్రి!
ABN, Publish Date - Feb 02 , 2024 | 04:31 PM
ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌పై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. గిల్ ఆటతీరుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా తాజాగా గిల్‌కు హెచ్చరికలు జారీ చేశాడు.
ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill)పై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. గిల్ ఆటతీరుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కూడా తాజాగా గిల్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. వైజాగ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌కు (Vizag Test Match) కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి.. గిల్ వైఫల్యంపై స్పందించాడు. ఈ రోజు (శుక్రవారం) ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌లో గిల్ 34 పరుగులు చేసి అవుటయ్యాడు (India vs England).
``యువకులతో టీమిండియా కదం తొక్కుతోంది. యువ ఆటగాళ్లు సత్తా నిరూపించుకోవాలి. పుజార ఎదురుచూస్తున్నాడనే విషయాన్ని మరచిపోవద్దు. రంజీ ట్రోఫీలో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. బరిలోకి దిగడానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు`` అని రవిశాస్త్రి అన్నాడు. ఎన్ని అవకాశాలు ఇస్తున్నా గిల్ సద్వినియోగం చేసుకోవడం లేదని రవిశాస్త్రి అన్నాడు. షాట్ సెలక్షన్ విషయంలో గిల్ జాగ్రత్తగా ఉండాలని, అప్పుడే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడడం వీలవుతుందని సూచించాడు.
కాగా, ప్రస్తుతం రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజార (Cheteshwar Pujara) బ్యాట్‌తో చెలరేగుతున్నాడు. జార్ఖండ్‌పై అజేయంగా 243 పరుగులు చేశాడు. హర్యానాపై 49, 43 పరుగులు, విదర్భపై 43, 66 పరుగులు, సర్వీసెస్ టీమ్‌పై 91 పరుగులు చేశాడు. టీమిండియాకు పుజార దూరమై దాదాపు ఎనిమిది నెలలు దాటింది. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చివరి సారి టీమిండియా తరఫున ఆడాడు.
Updated Date - Feb 02 , 2024 | 04:31 PM