ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: సచిన్ నుంచి సైనా వరకు.. రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరైన వారు వీరే..!

ABN, Publish Date - Jan 23 , 2024 | 02:40 PM

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ప్రధాని మోదీ రామ్ లల్లా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రాణ ప్రతిష్ట (Ram Mandir Pran Pratishta) కార్యక్రమం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ప్రధాని మోదీ (PM Modi) రామ్ లల్లా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు ఏడు వేల మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించింది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరై రాముల వారి ఆశీర్వాదాలు పొందారు.

పలువురు క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, సౌరవ్ గంగూలీ, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్ సింగ్, ఆర్‌పీ సింగ్ మొదలైన క్రికెటర్లకు ఆహ్వానం అందింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఆహ్వానించారు. సచిన్, కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్, రవీంద్ర జడేజా, ఆర్పీ సింగ్, మిథాలీ రాజ్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక, ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరైంది. మాజీ క్రీడాకారిణి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఇక, దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ ట్విటర్ వేదికగా రామ మందిర ప్రాణ ప్రతిష్టపై స్పందించాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నాడు. శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం అందరిలో కలగాలని పేర్కొన్నాడు.

Updated Date - Jan 23 , 2024 | 02:41 PM

Advertising
Advertising