ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్? మిగతా టెస్టులకూ కోహ్లీ డౌటే!

ABN, Publish Date - Jan 31 , 2024 | 05:02 AM

ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు వ్యక్తిగత కారణాలతో దూరమైన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మిగతా టెస్టులు ఆడేది కూడా సందేహంగా మారింది. తన తల్లి లివర్‌ సమస్యతో బాధపడుతున్నందుకే

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు వ్యక్తిగత కారణాలతో దూరమైన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మిగతా టెస్టులు ఆడేది కూడా సందేహంగా మారింది. తన తల్లి లివర్‌ సమస్యతో బాధపడుతున్నందుకే కోహ్లీ బ్రేక్‌ తీసుకున్నట్టు సమాచారం. ఆమె పరిస్థితి సీరియ్‌సగా ఉండడంతో ఈ సిరీస్‌లోని మిగిలిన మూడు టెస్టులకు కూడా కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు తన రీఎంట్రీ గురించి విరాట్‌ నుంచి ఎటువంటి సమాచారం లేదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే జడేజా, రాహుల్‌ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇందులో జడేజా గాయం కాస్త ఆందోళనకరంగానే ఉందని, అతడు మిగిలిన సిరీస్‌ ఆడేది కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్‌సీఏ మెడికల్‌ సిబ్బంది నివేదిక వచ్చాక బోర్డు ఓ అంచనాకు రానుంది.

Updated Date - Jan 31 , 2024 | 07:49 AM

Advertising
Advertising