ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvraj Singh: అశ్విన్ ఆ టీమ్‌లో ఉండడానికి అనర్హుడు.. యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ABN, Publish Date - Jan 14 , 2024 | 02:38 PM

టీమిండియా తరఫున ఆడిన అత్యుత్తమ స్పిన్నర్లలో రవి చంద్రన్ అశ్విన్ ఒకడు. ఎన్నో ఏళ్లుగా జట్టులో కొనసాగుతూ సత్తా చాటుతున్నాడు. అయితే త్వరలో జరగబోయే ప్రపంచకప్ టీమ్‌లోకి అశ్విన్‌ను తీసుకోవడం చెత్త నిర్ణయం అని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా (Team India) తరఫున ఆడిన అత్యుత్తమ స్పిన్నర్లలో రవి చంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఒకడు. ఎన్నో ఏళ్లుగా జట్టులో కొనసాగుతూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పలు ప్రపంచకప్‌లలో కూడా ఆడాడు. అయితే త్వరలో జరగబోయే ప్రపంచకప్ టీమ్‌లోకి అశ్విన్‌ను తీసుకోవడం చెత్త నిర్ణయం అని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత టీ-20, వన్డే టీమ్‌ల్లో ఉండడానికి అశ్విన్ అనర్హుడని యువీ అభిప్రాయపడ్డాడు.

``అశ్విన్ గొప్ప బౌలర్ అనడంలో సందేహం లేదు. కానీ, వన్డేలు, టెస్ట్‌ల్లో అతడు పనికి రాడు. అతడి బ్యాటింగ్, ఫీల్డింగ్ వైట్ బాల్ క్రికెట్‌కు పనికి రావు. టెస్ట్‌లో అతడిని కొనసాగించడంలో తప్పు లేదు. కానీ, వన్డేలు, టీ-20లకు అతడిని తీసుకోవాలనుకోవడం తప్పు`` అని యువీ అభిప్రాయపడ్డాడు. అలాగే రోహిత్ (Rohit Sharma), హార్దిక్ (Hardik Pandya) వివాదంపై కూడా యువీ స్పందించాడు. హార్దిక్ సారథ్యంలో రోహిత్ ఆడాల్సి రావడం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదన్నాడు.

``నా దృష్టిలో రోహిత్ గొప్ప కెప్టెన్. ముంబైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. టీమిండియాను వన్డే ప్రపంచకప్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. రోహిత్ సారథ్యంలోనే హార్దిక్‌లోని అత్యుత్తమ ప్రతిభ బయటపడింది. హార్దిక్ ఫిట్‌నెస్ సాధిస్తే టీమిండియా టీ-20 జట్టుకు కూడా నాయకత్వం వహించే అవకాశం వస్తుంద``ని యువరాజ్ పేర్కొన్నాడు.

Updated Date - Jan 14 , 2024 | 02:38 PM

Advertising
Advertising