ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gaming apps: రియల్-మనీ గేమింగ్ యాప్స్‌ వాడుతున్న వారికి గూగుల్ షాకింగ్ న్యూస్!

ABN, Publish Date - Jan 12 , 2024 | 05:56 PM

రియల్ మనీ గేమింగ్ యాప్స్ వాడుతున్న వారికి టెక్ దిగ్గజం గూగుల్ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్ నుంచి రియల్ మనీ గేమింగ్ యాప్స్‌ వాడకంపై సర్వీస్ ఛార్జీలు విధించాలని యోచిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. డైలీ ఫాంటసీ, రమ్మీతోపాటు పలు గేమింగ్ యాప్స్‌పై ఈ ఛార్జీలు ఉంటాయని తెలిపింది. ఇక భారత్, మెక్సికో, బ్రెజిల్‌ దేశాలలో ఈ ఏడాది జూన్ నుంచి ‘గూగుల్ ప్లే స్టోర్’పై మరిన్ని రకాల రియల్ మనీ గేమింగ్ యాప్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.

రియల్ మనీ గేమింగ్ యాప్స్ వాడుతున్న వారికి టెక్ దిగ్గజం గూగుల్ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్ నుంచి రియల్ మనీ గేమింగ్ యాప్స్‌ వాడకంపై సర్వీస్ ఛార్జీలు విధించాలని యోచిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. డైలీ ఫాంటసీ, రమ్మీతోపాటు పలు గేమింగ్ యాప్స్‌పై ఈ ఛార్జీలు ఉంటాయని తెలిపింది. ఇక భారత్, మెక్సికో, బ్రెజిల్‌ దేశాలలో ఈ ఏడాది జూన్ నుంచి ‘గూగుల్ ప్లే స్టోర్’పై మరిన్ని రకాల రియల్ మనీ గేమింగ్ యాప్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గేమింగ్ యాప్స్‌పై 28 శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చింది. నాటి నుంచి గేమింగ్ కంపెనీలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు మునుపటి నుంచి ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వాధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో గూగుల్ ఈ సర్వీస్ ఛార్జీ ప్రకటన చేసింది.


గూగుల్ ప్లే స్టోర్ అందించే విలువను ప్రతిబింబించేలా, ఆండ్రాయిడ్, ప్లే ఎకోసిస్టమ్స్‌కు సహాయపడే విధానంలో సర్వీస్ ఛార్జీలు ఉంటాయని గూగుల్ తెలిపింది. ఈ మేరకు యాప్ డెవలపర్స్‌తో మాట్లాడుతున్నామని, రాబోయే నెలల్లోనే తమ కొత్త విధాన, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల్లో తమ భాగస్వామ్యం పెరుగుతుందని ప్రకటనలో పేర్కొంది. కాగా గూగుల్ ప్రస్తుతం ఇన్-యాప్ కొనుగోళ్లు, యాప్ విక్రయాలపై 15-30 శాతం వరకు ఛార్జీలు వసూలు చేస్తోంది. ‘యూజర్ ఛాయిస్ బిల్లింగ్’ అనే పేరిట ప్రత్యమ్నాయ బిల్లింగ్ వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచింది. సర్వీసెస్ ఛార్జీపై 4 శాతం తగ్గింపుతో దీనిని ఆఫర్ చేస్తోంది. యాప్ కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్‌లపై యాప్ డెవలపర్లు 11-26 శాతం వరకు గూగుల్‌కి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తున్న విషయం తెలిసిందే. ఇక తమ యాప్‌లు స్థానిక చట్టాలు, ఆధునీకరించిన విధానాలకు అనుగుణంగా ఉన్నాయని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా యాప్ డెవలపర్లకే గూగుల్ వదిలేసింది. కాగా స్వీయ-నియంత్రణ సంస్థలు (ఎస్ఆర్‌వో) ఆమోదించే అన్ని రకాల రియల్-మనీ గేమ్‌లను ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచుతామని సెప్టెంబర్ నెలలో గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - Jan 12 , 2024 | 05:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising