iPhone Lock Tips: మీ ఐఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? ఇలా ఈజీగా అన్‌లాక్ చేయండి..!
ABN, Publish Date - Jan 06 , 2024 | 04:00 PM
సాధారణంగా ఏ ఫోన్ అయినా పాస్‌వర్డ్ మర్చిపోతే.. దాని లాక్ తీయడం దాదాపు అసాధ్యం. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చిన్న టిప్స్ పాటిస్తే.. అన్‌లాక్ చేయడానికి వీలుంటుంది. అదే ఆపిల్ ఐఫోన్‌లో పాస్‌వర్డ్ మర్చిపోతే దానిని అన్‌లాక్ చేయడం దాదాపు అసాధ్యమే. ఫోన్‌ను పూర్తిగా రీసెట్ చేయడం, బ్యాకప్ నుంచి డేటాను పొందడం మినహా మరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంటుంది. అయితే, iOS 17 అప్‌డేట్‌తో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది యాపిల్ సంస్థ.
iPhone Secret Tips: సాధారణంగా ఏ ఫోన్ అయినా పాస్‌వర్డ్ మర్చిపోతే.. దాని లాక్ తీయడం దాదాపు అసాధ్యం. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చిన్న టిప్స్ పాటిస్తే.. అన్‌లాక్ చేయడానికి వీలుంటుంది. అదే ఆపిల్ ఐఫోన్‌లో పాస్‌వర్డ్ మర్చిపోతే దానిని అన్‌లాక్ చేయడం దాదాపు అసాధ్యమే. ఫోన్‌ను పూర్తిగా రీసెట్ చేయడం, బ్యాకప్ నుంచి డేటాను పొందడం మినహా మరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంటుంది. అయితే, iOS 17 అప్‌డేట్‌తో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది యాపిల్ సంస్థ.
కొత్త అప్‌డేట్‌లో iPhone వినియోగదారులకు ఒక చిన్న అవకాశాన్ని కల్పించింది. దీని ప్రకారం.. iPhone పాస్‌వర్డ్ ను రీసెట్ చేయడానికి గతంలో ఉపయోగించిన పాస్‌కోడ్‌ను ఉపయోగించవచ్చు. అయితే, దీనిని రీసెట్ చేయాలన్నా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. కొత్త అప్‌డేట్ ప్రకారం.. పాస్‌కోడ్ రీసెట్ ఎలా చేయాలో ఆ వివరాలను ఓసారి తెలుసుకుందాం.
వినియోగదారులు.. ఐఫోన్ పాస్‌కోడ్‌ను మార్చిన 72 గంటలలోపు మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అలాగే, వినియోగదారులు చివరిగా ఉపయోగించిన పాస్‌కోడ్‌ను తప్పక గుర్తుంచుకోవాలి. ఒకవేళ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినట్లయితే.. ఇంతకు ముందు ఉపయోగించిన పాస్‌కోడ్‌ను కరెక్ట్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ ఫీచర్ కేవలం iOS 17లో మాత్రమే అందుబాటులో ఉంది. అందుకే.. మీ iPhone iOS 17కి అప్‌డేట్ చేయబడిందా? లేదా? అని ముందుగా నిర్ధారించుకోండి.
పాత పాస్‌కోడ్‌తో iPhone పాస్‌కోడ్‌ను రీసెట్ చేయడం ఎలా?
👉 లాక్ అయిన ఐఫోన్‌ని తీసుకుని, తప్పు పాస్‌కోడ్‌ను ఐదుసార్లు ఎంటర్ చేయండి.
👉 ఆ వెంటనే స్క్రీన్‌పై 'అఫోన్ నాట్ అవైలబుల్' అని మెసేజ్ వస్తుంది.
👉 మునుపటి పాస్‌కోడ్ ఆప్షన్‌పై ఎంటర్ నొక్కండి. ఆ వెంటనే మరొక స్లైడ్ ఓపెన్ అవుతుంది.
👉 నెక్ట్స్ స్క్రీన్‌లో, మీ పాత పాస్‌కోడ్‌ను నమోదు చేయండి.
👉 అలా చేసిన తర్వాత.. మీ పాస్‌కోడ్‌ను వెంటనే మార్చడానికి కొత్త ప్రాంప్ట్ కనిపిస్తుంది.
👉 మీ కొత్త పాస్‌కోడ్‌ని నమోదు చేసి, మొబైల్‌ను అన్‌లాక్ చేయండి.
iOS 17తో అప్‌డేట్ చేసిన కొత్త పాస్‌కోడ్ రీసెట్ ఆప్షన్ చాలా మంది ఐఫోన్ వినియోగదారులకు మంచి విషయమే. అయితే, పరిమిత 72 గంటల విండో ముగిసిన తర్వాత అది నిరుపయోగంగా మారుతుంది. ఆ సమయంలో మొత్తం ఐఫోన్‌ను రీసెట్ చేసే పాత పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
Updated Date - Jan 06 , 2024 | 04:00 PM