Gadgets: గ్యాడ్జెట్ ప్రియులారా బీ రెడీ.. ఈ 2024 మీ కోసమే.. సరికొత్తగా వచ్చేస్తున్నాయ్..!
ABN, Publish Date - Jan 03 , 2024 | 07:20 PM
2023 గడిచిపోయింది.. న్యూ ఇయర్ 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేశాం. ఇన్నాళ్లు 2023లో టెక్ గ్యాడ్జెట్లు ఎన్నో రకాలుగా అప్డేట్ అవుతూ మనకు ఎన్నో ప్రయోజనాలను అందించాయి. దీంతో 2024లోనూ కంపెనీలు తమ బ్రాండ్ పరికరాలను అప్డేట్ చేసేందుకు సిద్దం అయ్యాయి.
2023 గడిచిపోయింది.. న్యూ ఇయర్ 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేశాం. ఇన్నాళ్లు 2023లో టెక్ గ్యాడ్జెట్లు ఎన్నో రకాలుగా అప్డేట్ అవుతూ మనకు ఎన్నో ప్రయోజనాలను అందించాయి. దీంతో 2024లోనూ కంపెనీలు తమ బ్రాండ్ పరికరాలను అప్డేట్ చేసేందుకు సిద్దం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా స్మార్ట్‌ఫోన్‌లు, వీఆర్ హెడ్‌సెట్‌లు, జెనరేటివ్ ఏఐ వంటివి 2023లో ప్రత్యక్షమయ్యాయి. అయితే.. 2024లో కన్స్యూమర్ టెక్ కంపెనీలు అన్ని విధాలుగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా లాంచ్ అయ్యే కొన్ని రకాల డివైజ్‌లను ఇప్పుడు చూద్దాం.
వీవో (Vivo X 100) సిరీస్.. వీవో తన ఫ్లాగ్‌షిప్ (X100) పరికరాలను జనవరి 4న విడుదల చేయనుంది. ఇందులో Vivo X100 ,Vivo X100 Pro అనే రెండు వేరియంట్‌లు ఉంటాయి. హ్యాండ్‌సెట్ మీడియా టెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. గతంలోని X90 సిరీస్‌తో పోల్చినప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆప్టికల్ మెరుగ్గా ఉండటం విశేషం. ఆసస్ (ROG) ఫోన్ 8, ఫోన్ 8 ప్రో.. ఆసస్ నుంచి గేమ్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ జనవరి 9న ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. కొత్త (ROG) ఫోన్ 8, ఫోన్ 8 ప్రోలు గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి (ROG) ల్యాప్‌టాప్‌ల సహాయం తీసుకోనున్నాయి.
శామ్ సంగ్ గెలాక్సీ (S24) సిరీస్.. ప్రముఖ టెక్ దిగ్గజం గెలాక్సీ S24, గెలాక్సీ S24+, గెలాక్సీ S24 అల్ట్రాలను ఈ సంవత్సరం విడుదల చేస్తుంది. అలాగే, 2024లో మరిన్ని (AI) ఆధారిత సామర్థ్యాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను, ఆరో తరం ఫోల్డబుల్ ఫోన్‌లను పరిచయం చేయాలని శామ్ సంగ్ సంస్థ భావిస్తోంది. యాపిల్ (iPhone 16) సిరీస్, (iPhone SE).. యాపిల్ సంస్థ ఈ సంవత్సరం iPhone 16 సిరీస్‌ను iPhone SE 4తో కలిపి లాంచ్ చేస్తుందని ప్రకటించింది. (iPhone SE) 4 మార్చి 2024లో ప్రారంభం కానుంది. ఇది ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ మోడల్‌ల టోన్డ్-డౌన్ వెర్షన్‌ను అందిస్తోంది. తరువాత సెప్టెంబర్‌లో iPhone 16 సిరీస్ మరిన్ని ట్వీక్‌లు, ఆవిష్కరణలను తీసుకువస్తుందని భావిస్తున్నారు.
మెరుగైన (AI) ఫీచర్లతో (Google Pixel) ఫోన్లు.. ఈ సంవత్సరం గూగుల్ నుంచి అప్‌గ్రేడ్ చేసిన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇది తరువాతి తరం పిక్సెల్ ఫోన్‌లకు పోటీగా నిలవనుంది. ప్రస్తుత పిక్సెల్ లైనప్‌తో పోల్చినప్పుడు ఈ పరికరాలు అధునాతన ఏఐ ఫీచర్‌లను అనుసంధానం చేసేందుకు తయారుచేయబడ్డాయి. వన్ ప్లస్ 12, వన్ ప్లస్ 12R, Nord సిరీస్.. (OnePlus 12) ను జనవరి 23న ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. దానితో పాటు OnePlus 12R కూడా ఉంటుంది. మరోవైపు, ఏడాది పొడవునా అనేక నార్డ్ సిరీస్‌లను కంపెనీ ప్రారంభించనుంది. రియల్ మి (GT 5) సిరీస్, (Narzo).. రియల్ మి 2024లో కొత్త జీటీ 5 సిరీస్‌ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. బడ్జెట్ కలిసొచ్చేలా తక్కువ ధరలకే నార్జో పరికరాలను విడుదల చేస్తుండటం విశేషం. మోటోరోలా (Moto Edge) సిరీస్.. మోటొరోలా కొత్త ఎడ్జ్ సిరీస్‌ను 2024లో లాంచ్ చేస్తుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఈ పని చేస్తోంది. అంతే కాకుండా ఈ సంవత్సరం కొత్త తరం ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌లనూ తీసుకురానుంది.
Updated Date - Jan 03 , 2024 | 07:20 PM