ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Google: గూగుల్ నుంచి షాకింగ్ న్యూస్..ముఖ్యమైన ఫైల్స్ డిలీట్!

ABN, Publish Date - Jan 08 , 2024 | 12:52 PM

గూగుల్(Google) తన ఫైల్స్(Files) బై గూగుల్ యాప్‌లోని ‘ముఖ్యమైన(important)’ ట్యాబ్ ఫీచర్‌ను వచ్చే నెలలో తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాబ్‌లో నిల్వ చేయబడిన మొత్తం సమాచారం తొలగించబడుతుందని స్పష్టం చేసింది.

ప్రముఖ టెక్ సంస్థ గూగుల్(Google) క్రమంగా అన్నింటికీ యూజర్ల నుంచి వసూలు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే జీమెయిల్ డ్రైవ్ స్పేస్ సహా యూట్యూబ్ ఛానెళ్లలో కూడా ప్రీమియంను వసూలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తన ఫైల్స్ బై యాప్‌లో ‘ముఖ్యమైన’( important) ట్యాబ్ ఫీచర్‌ను వచ్చే నెలలో నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఆ ఫీచర్ తొలగించిన తర్వాత ఆ ట్యాబ్‌లో నిల్వ చేసుకున్న మొత్తం సమాచారం తొలగించబడుతుందని వెల్లడించింది.


అయితే ఈ ఫీచర్ గత ఏడాది మొదలు కాగా..ఈ సంవత్సరం ఈ నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆయా డాక్యుమెంట్‌లను నిల్వ చేయడానికి ‘ముఖ్యమైన’ ట్యాబ్‌ని ఉపయోగించిన వినియోగదారులు తమ ఫైల్‌లను ఫిబ్రవరి 15, 2024లోపు బ్యాకప్‌ చేసుకోవాలని సూచించారు. ఈ తేదీ తర్వాత ఆ ట్యాబ్‌లో సేవ్ చేసిన అన్ని డాక్యుమెంట్‌లు శాశ్వతంగా పోతాయని హెచ్చరించింది. ఈ ఫీచర్(feature) గత సంవత్సరం వినియోగదారులకు పరిచయం చేయబడింది. భారతదేశంలో అనేక మంది ఆధార్ కార్డ్‌లు, పాన్ కార్డ్‌లు, పాస్‌పోర్ట్‌లు వంటి ప్రభుత్వ IDలు వంటి కీలకమైన పత్రాలను కలిగి ఉండే పరికరాల కోసం ప్రత్యేకంగా దీనిని ఉపయోగిస్తున్నారు. 9to5Google నివేదిక ప్రకారం ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.

Updated Date - Jan 08 , 2024 | 12:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising