Vivo: లాంచ్‌కు ముందే వీవో వీ30 సిరీస్ మొబైళ్ల ధర తెలిసిందోచ్.. ఎంతంటే
ABN, Publish Date - Mar 03 , 2024 | 07:14 PM
Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు వీవో కంపెనీ వారం రోజుల క్రితం ప్రకటించింది. ఈ సిరీస్‌లో Vivo V0, V30 Pro రానున్నాయి. కంపెనీ ఫిబ్రవరి ప్రారంభంలో Vivo V30 సిరీస్‌ని ఆవిష్కరించింది. భారత్‌లో ఈ వేరియంట్ లాంచ్ తేదీని తాజాగా ప్రకటించింది.
ఢిల్లీ: Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు వీవో కంపెనీ వారం రోజుల క్రితం ప్రకటించింది. ఈ సిరీస్‌లో Vivo V0, V30 Pro రానున్నాయి. కంపెనీ ఫిబ్రవరి ప్రారంభంలో Vivo V30 సిరీస్‌ని ఆవిష్కరించింది. భారత్‌లో ఈ వేరియంట్ లాంచ్ తేదీని తాజాగా ప్రకటించింది. దీని కోసం కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్‌ను కూడా రూపొందించింది.
Vivo V30, Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో మార్చి 7న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. స్మార్ట్‌ఫోన్‌లు అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ రంగులలో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా అధికారిక వెబ్‌సైట్, భారత్‌లోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయి.
Vivo V30 సిరీస్ అంచనా ధర
Vivo V30 సిరీస్ ప్రీమియం మిడ్-రేంజ్ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంది. Vivo V30 రూ. 33,999, V30 Pro రూ. 41,999గా ఉండవచ్చిని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫీచర్లివే..
Vivo V30 Pro వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు OIS-సపోర్టెడ్ పోర్ట్రెయిట్ కెమెరాలు, బ్లాక్ ప్యానెల్‌పై Vivo సిగ్నేచర్ ఆరా లైట్ ఫీచర్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లు జీస్ లెన్స్‌లతో వస్తాయి. Vivo V30 స్మార్ట్‌ఫోన్.. గ్లోబల్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 5,000mAh బ్యాటరీ, 6.78-అంగుళాల 120Hz పూర్తి HD AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. కెమెరా ముందు భాగం OIS టెక్నాలజీతో 50MP ప్రైమరీ సెన్సార్, ఆరా లైట్ యూనిట్‌తో పాటు అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 50MP సెన్సార్ కలిగి ఉంటుంది.
ఈ ఫీచర్లు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఉపయోగపడతాయి. Vivo V30 Pro డిసెంబర్ 2023లో చైనాలో ప్రారంభించిన Vivo S18కి మరో రూపం. 50MP సోనీ IMX920 ప్రైమరీ సెన్సార్, 50MP సోనీ IMX816 పోర్ట్రెయిట్ కెమెరా కలిగి ఉంటుంది. అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంటుంది. Vivo V30 Pro, MediaTek డైమెన్సిటీ 8200 SoC ద్వారా శక్తిని పొందుతుంది. Android 14-ఆధారిత FuntouchOS 14ని కలిగి ఉంటుంది. ఇది 6.78-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.
Updated Date - Mar 03 , 2024 | 07:45 PM