Meta: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కొత్త అప్‌డేట్ ఇదిగో
ABN, Publish Date - Feb 04 , 2024 | 01:37 PM
ఆండ్రాయిడ్ వినియోగదారులకు(Android Users) వాట్సప్(WhatsApp) గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సప్ అకౌంట్లు, ఛానెల్‌లు రెండింటి కోసం ఆటోమెటిక్ వ్యవస్థలో పని చేసే నివేదికలను రూపొందించడానికి మెటా సిద్ధమైంది.
ఢిల్లీ: వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన అప్‌డేట్‌లను పరిచయం చేసే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ (WhatsApp) మరో సరికొత్త ఫీచర్‌ను అందబాటులోకి తీసుకురాబోతోంది. యూజర్ల వాట్సప్ అకౌంట్లు, ఛానెల్‌లకు సంబంధించిన నెలవారీ రిపోర్టులను ఆటోమేటిక్‌గా జనరేట్ చేసే ఫీచర్‌ను డెలవప్ చేస్తోంది. ఈ విషయాన్ని టెక్ వెబ్‌సైట్ వెబ్‌బెటాఇన్ఫో (WABetaInfo) రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ వాట్సప్ అకౌంట్లు, ఛానెల్‌కు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం నెలవారీగా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది.
ఈ ఆటోమేటెడ్ ఫీచర్ వినియోగదారుల ప్రమేయం లేకుండా, సమయాన్ని సేవ్ చేస్తూ సంబంధిత సమాచారాన్ని సకాలంలో అందుబాటులో ఉంచుతుంది. తమ అకౌంట్‌కు సంబంధించిన నెలవారీ రిపోర్టులను పోల్చిచూసుకోవడం ద్వారా సమాచారంలో మార్పులను సులభంగా గుర్తించవచ్చు. కాగా ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. మరోవైపు ఫైల్-షేరింగ్ ఫీచర్‌పై కూడా వాట్సప్ పని చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ సమీపంలోని వ్యక్తులతో ఫైళ్లను సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఫైల్స్‌ను పంపడానికి, స్వీకరించడానికి వీలుగా 'Peoples Nearby' ఆప్షన్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుందని ఇటీవలే ఒక రిపోర్ట్ పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 04 , 2024 | 01:54 PM