ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mobiles: Xiaomi 14 vs iPhone 15.. వీటిలో బెటర్ మొబైల్ ఏదంటే

ABN, Publish Date - Mar 10 , 2024 | 03:54 PM

Xiaomi ఇటీవల భారత్‌లో షియామీ(Xiaomi) 14 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ 12GB RAM, 512GB స్టోరేజ్‌తో రూ.69,999 ధరతో అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ముంబయి: Xiaomi ఇటీవల భారత్‌లో షియామీ(Xiaomi) 14 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ 12GB RAM, 512GB స్టోరేజ్‌తో రూ.69,999 ధరతో అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లైకా కెమెరా, 4,610mAh బ్యాటరీని కలిగి ఉంది.

అయితే దీని ఫీచర్స్ ఐఫోన్‌తో పోలీ ఉండటంతో Xiaomi 14, iPhone 15లో ఏది బెటర్ అని వినియోగదారులు వెతుకుతున్నారు. Apple iPhone 15తో షియామీ 14 పోటీపడుతోంది. వాటి మధ్య తేడాలు తెలుసుకుని మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోండి.

పనితీరు..

Xiaomi 14 Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో పాటు 12GB వరకు RAM, 512GB స్టోరేజ్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే హైపర్‌ఓఎస్‌తో ఫోన్ రన్ అవుతుంది. మరోవైపు, ఐఫోన్ A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. 6GB RAM, 512GB స్టోరేజ్ కెపాసిటీ దీనికి ఉంది. ఐఫోన్ 15 iOS 17తో ఇది పని చేస్తుంది.

డిస్‌ప్లే..

Xiaomi 14 1200 x 2670p రిజల్యూషన్‌తో 6.36-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz వరకు రిఫ్రెష్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ ప్లేబ్యాక్‌కు మద్దతు ఇస్తుంది. గొరిల్లా గ్లాస్‌తో డిస్‌ప్లేను రక్షించవచ్చు. iPhone 15.. 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో 2556 x 1179 పిక్సెల్ రిజల్యూషన్‌, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 2000నిట్‌ల ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఫింగర్‌ప్రింట్-రెసిస్టెంట్ ఒలియోఫోబిక్ కోటింగ్‌తో వస్తుంది.


కెమెరా...

Xiaomi 14 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, మరొక 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఫోన్ 10-బిట్ డాల్బీ విజన్ HDR,10-బిట్ LOGతో సహా 8K@24fps వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు. ముందు కెమెరా 32 మెగాపిక్సెల్స్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఐఫోన్ 15 డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 48MP ప్రధాన కెమెరా, రెండు 12MP లెన్స్‌లు వైడ్, అల్ట్రా-వైడ్ షాట్‌లు ఉంటాయి. ఇది షూటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది.

బ్యాటరీ..

Xiaomi 14.. 4,610mAh బ్యాటరీతో వస్తుంది. 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 90W ఫాస్ట్ వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌నిస్తుంది.

iPhone 15 బ్యాటరీ 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మాత్రమే మద్దతు ఇస్తుంది.

ధర..

Xiaomi 14 12GB RAM, 512GB స్టోరేజ్ ధర రూ. 69,999. అయితే 128Gb స్టోరేజ్ కలిగిన iPhone 15 ప్రస్తుతం Apple వెబ్‌సైట్‌లో రూ.79,999కి అందుబాటులో ఉంది.

సరసమైన ధరలో అధిక పనితీరు, ఫీచర్లతో కూడిన ఫోన్ కోసం చూస్తున్న వారికి Xiaomi 14 ఒక గొప్ప ఎంపిక. ఇది అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్, డెడికేటెడ్ టెలిఫోటో కెమెరా, తాజా చిప్‌సెట్‌తో పాటు వేగవంతమైన ఛార్జింగ్‌తో వస్తుంది. మరోవైపు, iPhone 15లో అధిక రిఫ్రెష్ రేట్ లేదు. అదనపు ఫీచర్లు ఏవీ కనిపించవు. మొత్తం మీద Xiaomi 14.. iPhone 15 కంటే మెరుగైన ఫీచర్లు కలిగి ఉంది.

Updated Date - Mar 10 , 2024 | 03:54 PM

Advertising
Advertising