ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోకలితో తల్లిని కొట్టి చంపిన సైకో!

ABN, Publish Date - Jan 06 , 2024 | 04:28 AM

కొన్నిరోజులుగా మానసిక సంతులత కోల్పోయిన ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి కన్నతల్లిని రోకలితో కొట్టి చంపాడు. భార్యనూ చంపేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుంది.

కొన్నాళ్లుగా నిందితుడికి మానసిక రుగ్మత

10రోజులుగా నిద్రపోకుండా భార్య, తల్లితో గొడవ

ఇద్దరిపైనా దాడికి యత్నం.. తప్పించుకున్న భార్య

వారించబోయిన మరో మహిళపైనా దాడి

తీవ్రగాయాలతో ఆమె కోమాల్లో.. భుపాలపల్లి జిల్లాలో ఘటన

రేగొండ, జనవరి 5: కొన్నిరోజులుగా మానసిక సంతులత కోల్పోయిన ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి కన్నతల్లిని రోకలితో కొట్టి చంపాడు. భార్యనూ చంపేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుంది. తల్లిపైన దాడిని ఆపే ప్రయత్నం చేసిన పొరుగింటి మహిళపైనా అతడు రోకలితో కొట్టడంతో ఆమె తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. తల్లిని చంపి.. మరో మహిళను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టిన ఆ ఉన్మాది రోకలి పట్టుకొని ఊరంతా తిరుగుతూ వీరంగం సృష్టించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంచర్లకుంట్ల మోహన్‌రెడ్డి-హైమ (60) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజిరెడ్డి(42) భార్య సరితతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. రాజిరెడ్డి ఇద్దరు కుమారులు హనుమకొండలోని ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. రాజిరెడ్డి మానసిక రుగ్మతలో బాధపడుతూ భార్యతో గొడవ పడేవాడు. పది రోజుల నుంచైతే రాత్రుళ్లు నిద్రపోకుండా గొడవ చేస్తూ ‘నాకు శక్తి ఆవహించింది’ అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి భార్యతో గొడవపడ్డాడు. తెల్లవారుజామున లేచి ఆస్పత్రికి వెళదామని.. పడుకోమని ఆమె సముదాయించినా రాజిరెడ్డి వినిపించుకోలేదు. ‘నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? చంపుతారా ఏం?’ అంటూ తల్లి, భార్యను బూతులు తిట్టాడు.

అతడి తీరుకు భయపడిపోయిన తల్లి హైమ, భార్య సరిత ఎదురుగా ఉన్న మరో ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నారు. అక్కడికీ వెళ్లిన రాజిరెడ్డి ఇంట్లోంచి బయటికి రాకపోతే బయట ఉన్న పత్తినంతా తగులబెడతానంటూ హెచ్చరించాడు. దీంతో హైమ, సరిత బయటకు వచ్చారు. వెంటనే పక్కనే ఉన్న రోకలిని రాజిరెడ్డి చేతుల్లోకి తీసుకోవడంతో ఇద్దరూ ప్రాణభయంతో చెరోవైపు పరుగు తీశారు. తల్లి హైమ తలపై రాజిరెడ్డి రోకలితో కొట్టడంతో తల ఛిద్రమైపోయి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పక్కింట్లో ఉన్న ఊకంటి జ్యోతి అనే మహిళ గొడవకు నిద్రలేచి బయటకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమె తలపైనా రోకలితో కొట్టాడు రాజిరెడ్డి. ఆమె తీవ్ర గాయాలతో కింద పడిపోయింది. అప్పటికే పారిపోయిన భార్య సరిత చుట్టుపక్కల వారిని తీసుకువచ్చేలోగా.. ‘ఇద్దరిని చంపేసిన.. ఎవరు వస్తారో రండి.. అందర్నీ చంపుతా’ అంటూ అని రాజిరెడ్డి వెంటపడడంతో జనం ఇళ్లలోకి పరుగెత్తి తలుపులు వేసుకున్నారు. తర్వాత రాజిరెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులొచ్చి గాయపడిన జ్యోతిని అంబులెన్సులో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె కోమాలో ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాకలో రాజిరెడ్డి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానికులు పట్టుకని కట్టేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా జ్యోతి చిన్న కుమారుడు పది నెలల క్రితం పరకాలలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంవత్సరం లోపే సైకో దాడిలో ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 04:28 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising