ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manchiryāla- దశాబ్దాల సమస్యకు పరిష్కారం

ABN, Publish Date - Feb 01 , 2024 | 10:40 PM

అటవీ అనుమతులు లేవనే ఒకే ఒక్క కారణంతో ఆ రోడ్డుపై దశాబ్దాల కాలంగా అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. నెన్నెల-బెల్లంపల్లి ప్రధాన రహదారిపై బొప్పారం నుంచి దుగ్నపల్లి ఒడ్డు వరకు డబుల్‌ రోడ్డు పనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు.

పనులు ప్రారంభిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

నెన్నెల, ఫిబ్రవరి 1: అటవీ అనుమతులు లేవనే ఒకే ఒక్క కారణంతో ఆ రోడ్డుపై దశాబ్దాల కాలంగా అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. నెన్నెల-బెల్లంపల్లి ప్రధాన రహదారిపై బొప్పారం నుంచి దుగ్నపల్లి ఒడ్డు వరకు డబుల్‌ రోడ్డు పనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. పాత సింగిల్‌ రోడ్డుపైన బీటీ వేయడంతో రోడ్డు ఎత్తు పెరిగింది. రోడ్డుకు రెండు వైపుల మట్టి పోసేందుకు అనుమతి ఇవ్వక పోవడంతో రెండు ఫీట్ల లోతు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఎదురెదురుగా వాహనాలు వస్తే పక్కకు దిగలేని పరిస్థితి. ఇక్కడే లెక్క లేనన్ని ప్రమాదాలు జరిగాయి. పనులు చేసినప్పుడల్లా ఫారెస్టు అధికారులు అడ్డుకునేవారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు సమస్యను బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఫారెస్టు అధికారులతో మాట్లాడారు. సమస్య తీవ్రతను వివరించి అనుమతులు పొందారు. వెంటనే పనులు ప్రారంభించుకోవాలని ఎమ్మెల్యే సూచిం చారు. ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, సర్పంచ్‌ తోట సుజాతశ్రీనివాస్‌ గురువారం పనుల ప్రారంభించారు. ఇరువైపుల మొరం పోసి చదును చేస్తున్నారు. మట్టి పనులు చేపట్టడంపైఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో గొళ్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు గట్టు మల్లేష్‌, ఉప సర్పంచ్‌ పుప్పాల అంజన్న, నాయకులు గట్టు బానేష్‌, గోవింద్‌సింగ్‌, మహేష్‌గౌడ్‌, చెన్నోజు శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 10:40 PM

Advertising
Advertising