ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉల్లాసంగా భోగి వేడుకలు

ABN, Publish Date - Jan 14 , 2024 | 10:02 PM

భోగి పండుగ వేడుకలను ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. జీవితంలో భోగభాగ్యాలను ప్రసాదించాలని తెల్లవారుజామున ప్రజలు భోగి మంటలను కాగుతూ వేడుకలను నిర్వహించారు. ఇండ్ల ముందు ఆవుపేడ చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మల్లో రేగు పండ్లు పెట్టి పూజలు చేశారు.

దండేపల్లి, జనవరి 14: భోగి పండుగ వేడుకలను ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. జీవితంలో భోగభాగ్యాలను ప్రసాదించాలని తెల్లవారుజామున ప్రజలు భోగి మంటలను కాగుతూ వేడుకలను నిర్వహించారు. ఇండ్ల ముందు ఆవుపేడ చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మల్లో రేగు పండ్లు పెట్టి పూజలు చేశారు.

వేమనపల్లి: భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అందమైన ముగ్గులతో గ్రామాల్లోని కాలనీలు దర్శనమిచ్చాయి.

భీమారం: మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఇండ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, రేగుపండ్లు గరక, బంతిపూలతో అలంకరించారు.

చెన్నూరు: చెన్నూరు పట్టణంలో, మండలంలో భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇండ్లలో పిండి వంటలు చేసుకున్నారు.

నస్పూర్‌: భోగి పండగను పట్టణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అం దమైన ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు, రేగుపండ్లు, గరిక, బంతిపూలు, ధాన్యంను వేశారు. చిన్న పిల్లలకు చిల్లర నాణేలతో దిష్టి తీసివేశారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలో భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలు వేశారు. విశ్వనాధ ఆలయంలో గోదా దేవి రంగనాయకుల స్వామి కల్యాణం జరగగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజ రయ్యారు. తీర్ధ ప్రసాదాల అనంతరం అన్నదానం నిర్వహించారు.

Updated Date - Jan 14 , 2024 | 10:02 PM

Advertising
Advertising