ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్‌తీగ తగిలి ఒకరు మృతి

ABN, Publish Date - Jan 14 , 2024 | 10:27 PM

సిర్పూర్‌(యు), జనవరి 14: మండలంలోని శెట్టిహడ్పునూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో గల చాప్రి గ్రామసమీప అటవీ ప్రాంతంలో అడవిజంతువులను వేంటాడేందుకు అమర్చిన విద్యుత్‌ తీగనుతాకి ఒకరు మృతిచెందారు. జైనూర్‌ సీఐ మల్లేష్‌ కథనం ప్రకారం..

సిర్పూర్‌(యు), జనవరి 14: మండలంలోని శెట్టిహడ్పునూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో గల చాప్రి గ్రామసమీప అటవీ ప్రాంతంలో అడవిజంతువులను వేంటాడేందుకు అమర్చిన విద్యుత్‌ తీగనుతాకి ఒకరు మృతిచెందారు. జైనూర్‌ సీఐ మల్లేష్‌ కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం చాప్రి గ్రామానికి చెందిన కొట్నాక భీమ్‌రావు(40),అదే గ్రామానికి చెందిన మెస్రం బొజ్జు ఇద్దరూ కలిసి వంటచెరుకు తీసుకురావడానికి అడవికి వెళ్లారు. వంట చెరుకు తీసుకునివస్తుండగా అడవిలో అడవిజంతువులను వేటాడేం దుకు అమర్చిన విద్యుతు తీగను తగిలి కొట్నాక భీమ్‌రావు కింద పడిపోయాడు. గమనించిన మెస్రం బొజ్జు వెంటనే కొట్నాక భీమ్‌రావును కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గ్రామనికి వచ్చి భీంరావు భార్య పూర్ణ బాయితోపాటు గ్రామస్థులకు తెలిపాడు. వారు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా భీమ్‌రావు మృతిచెంది ఉన్నాడు. మృత్యుడి భార్య కొట్నాక పూర్ణబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 14 , 2024 | 10:27 PM

Advertising
Advertising