Revanth Reddy: అవును, నేను మేస్త్రినే.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ABN, Publish Date - Jan 25 , 2024 | 05:55 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి పాత్ర వంటిద’ని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలా విమర్శలొచ్చాయో అందరికీ తెలుసు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోల్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి పాత్ర వంటిద’ని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలా విమర్శలొచ్చాయో అందరికీ తెలుసు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోల్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను మేస్త్రినే అని, మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రినంటూ బీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు. మిమ్మల్ని ఘోరీ కట్టే మేస్త్రిని కూడా తానేనంటూ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో భాగంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘అవును, నేను మేస్త్రినే. మీరు విధ్వంసం చేసిన తెలంగాణని పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రిని. మిమ్మల్ని ఘోరీ కట్టే మేస్త్రిని నేనే. ఈ నెలలోనే ఇంద్రవల్లి వస్తాను. కాస్కోండి’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు కేసీఆర్ రాజ్యసభ సభ్యులను చేశారని.. రూ. 50 వేలు కూడా లేకున్నా 52 వేల మెజార్టీతో గెలుపొందిన మందుల శామ్యూల్‌కి తాము టికెట్ ఇచ్చామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను ముఖ్యమంత్రినయ్యానని పేర్కొన్నారు. మరో రెండు హామీల అమలు కోసం ప్రభుత్వం సిద్ధమైందన్న ఆయన.. ఫిబ్రవరి చివరి వరకు రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో నగదు వేస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - Jan 25 , 2024 | 05:55 PM