ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి

ABN, Publish Date - Jan 13 , 2024 | 11:54 PM

పండుగల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి అన్నారు.

రఘునాథ్‌పాలెంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేస్తున్న పద్మావతిరెడ్డి

హుజూర్‌నగర్‌ / రూరల్‌, జనవరి 13: పండుగల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మఠంపల్లి రోడ్డులో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులపోటీలను తిలకించి విజేతలకు బహు మతులు అందించారు. సంక్రాంతి సంబురాలను వైభవంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో గల్లా వెంకటేశ్వర్లు, దేవ రం అనితరెడ్డి, చప్పిడి సావిత్రి, స్రవంతి, రవీందర్‌రెడ్డి, బలరామ్‌రెడ్డి, రాజానాయక్‌, ఆదెమ్మ, శకుంతలరెడ్డి, విజయకుమారి, రాజానాయక్‌, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

లింగగిరిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

యువకులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో రాణించాలని ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి కోరారు. మండలంలోని లింగగిరిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. 35 ఏళ్లుగా లింగగిరిలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్య క్రమంలో క్రీడల కమిటీ కన్వీనర్‌ నిజాముద్దీన్‌, హఫీజా, ఎంపీటీసీ విజయలక్ష్మీ, మర్రి లక్ష్మమ్మ, రాణెమ్మ, కట్టా గోపాల్‌రావుచౌదరి, చలమల రాఘవయ్య, చంద్రశేఖర్‌, సతీష్‌, ఆసిబ్‌, సద్దామ్‌, చలమల సతీష్‌, సత్తార్‌ పాల్గొన్నారు.

మఠంపల్లి : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను ఆమె ప్రారంభించి, విజేతలుగా నిలిచిన మౌనిక, సనా, సరస్వతీ, జస్మిత, లావణ్యలకు బహుమతులను అందజేశారు. అనంతరం రాజీవ్‌గాంధీ యూత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఆమె ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భూక్య మంజూనాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన రామచంద్రయ్య, మాజీ ఎంపీపీ రామిశెట్టి అప్పయ్య, ఎంపీటీసీ చెన్నయ్య, నాయుడు లక్ష్మయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు బొబ్బ రవీందర్‌రెడ్డి, షేక్‌ నాగుల్‌మీరా, చింతల వెంకటనారాయణ, నీజాం, అచ్చయ్య, మాఘం నర్సింహారావు, పున్నయ్య,మాఘం వెంకటేశ్వర్లు, బసవయ్య, అప్పరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమాజంలో ఆర్యవైశ్యుల సేవలు మరువలేనివి

తుంగతుర్తి: సమాజంలో ఆర్యవైశ్యులు చేస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శనివారం మండలకేంద్రంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాటి నుంచి నేటి వరకు సమాజంలో ఆర్యవైశ్యులు పేద ప్రజలకు సేవలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధకిషనరావు, పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్థన, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఓరుగంటి సత్యనారాయణ, పాలవరపు సంతోష్‌, గౌరవాధ్యక్షుడు ఈగ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఈగ నాగన్న, కోశాఽధికారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2024 | 11:54 PM

Advertising
Advertising