ప్రజాపాలన దరఖాస్తుల అన్‌లైన్‌లో తప్పులు దొర్లొద్దు
ABN, Publish Date - Jan 08 , 2024 | 10:36 PM
ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.
మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్
మేడ్చల్ జనవరి 8, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన దరఖాస్తుల అన్‌లైన్ నమోదుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 16 వరకు దరఖాస్తులను అన్‌లైన్‌లో అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. డేటా ఎంట్రీ అపరేటర్లు తప్పులు లేకుండా ఫారాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ అగస్త్య తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన దరఖాస్తుల అన్‌లైన్ నమోదుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా గ్రామ పంచాయతీల్లో 2,29,000ల దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి వివరించారు. ప్రతిరోజు 40వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు వేగంగా కంప్యూటరీకరంచాలి: జిల్లా కలెక్టర్ శశాంక
రంగారెడ్డి అర్బన్, జనవరి 8 : ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల వివరాలను వేగంగా కంప్యూటరీకరించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చేపట్టిన కంప్యూటరీకరణ ప్రక్రియను ఆయన సోమవారం తనిఖీ చేశారు. అనంతరం కంప్యూటీకరణ చేస్తున్న సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్ర, మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులున్నారు.
Updated Date - Jan 08 , 2024 | 10:36 PM