ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజారోగ్య కేంద్రాలకు ఎన్‌క్వాస్ సర్టిఫికెట్లు

ABN, Publish Date - Jan 30 , 2024 | 03:38 AM

రాష్ట్రంలోని 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 6 ఆరోగ్య ఉప కేంద్రాలు జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల సర్టిఫికెట్‌(ఎన్‌క్వా్‌స)కు ఎంపికైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించించింది. ఈమేరకు

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 6 ఆరోగ్య ఉప కేంద్రాలు జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల సర్టిఫికెట్‌(ఎన్‌క్వా్‌స)కు ఎంపికైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించించింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్‌, అడిషనల్‌ సెక్రటరీ లేఖ రాశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట, వనపర్తి జిల్లా కమలూద్దీన్‌పూర్‌ పీహెచ్‌సీలతోపాటు కరీంనగర్‌ జిల్లా కొండపాక, నల్గొండ జిల్లా వింజమూరు, సూర్యాపేట జిల్లా యండ్లపల్లి, కాసర్లపహాడ్‌, ఆదిలాబాద్‌ జిల్లా వాఘాపూర్‌, నిపణి ఆరోగ్య ఉప కేంద్రాలు ఈ సర్టిఫికెట్‌కుఎంపికయ్యాయి. ఈ గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాలకు కేంద్రం మూడేళ్లపాటు నేరుగా నిఽధులిస్తుంది. ఏటా పీహెచ్‌సీలకయితే రూ.3 లక్షలు, సబ్‌ సెంటర్లకు రూ.2 లక్షల చొప్పున ఇస్తారు. ఈ నిధులతో ఆయా ఆరోగ్య కేంద్రాలను మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.

Updated Date - Jan 30 , 2024 | 10:22 AM

Advertising
Advertising