ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mega Master Plan-2050 : పారిశ్రామిక అభివృద్ధికి.. మెగా మాస్టర్‌ ప్లాన్‌-2050

ABN, Publish Date - Jan 07 , 2024 | 03:24 AM

హైదరాబాద్‌ తరహాలో రాష్ట్రమంతటా 2050 నాటికి అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో ‘మెగా మాస్టర్‌ పాలసీ’ని రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రమంతటా హైదరాబాద్‌ తరహా అభివృద్ధి.. మూడు క్లస్టర్లుగా రాష్ట్ర విభజన

3 వేల ఎకరాలకొక ఫార్మా విలేజ్‌ ఏర్పాటు

సీఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ వెల్లడి

వెల్‌స్పన్‌ చైర్మన్‌ గోయెంకాతోనూ భేటీ

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ తరహాలో రాష్ట్రమంతటా 2050 నాటికి అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో ‘మెగా మాస్టర్‌ పాలసీ’ని రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ‘‘తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒకలా ఉంది. 2004-14 మరో మెట్టుకు చేరుకుంది. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత దశకు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన సచివాలయంలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రతినిధులతో సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్‌ ప్రణాళికలు, పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోయే ప్రాధాన్యతలను వివరించారు. ‘‘పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించడానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తోంది. పారిశ్రామిక అభివృద్థి విషయంలో అపోహలు, అనుమానాలకు తావు లేదు. పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తాం’’ అని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనే ఆలోచనలకు భిన్నంగా.. తమ ప్రభుత్వం కొత్త పాలసీని అనుసరిస్తోందని వివరించారు. హైదరాబాద్‌ ఒక్కచోటే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా.. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు రాజధాని నగరం మాదిరిగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.

అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ క్లస్టర్లు..

నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) లోపల అర్బన్‌ క్లస్టర్‌, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు మధ్యలో సెమీ అర్బన్‌ క్లస్టర్‌, రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు ఆవల ఉన్న ప్రాంతాన్ని రూరల్‌ క్లస్టర్‌గా గుర్తించి, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ‘‘ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలున్నాయి. ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేస్తాం. ఓఆర్‌ఆర్‌పై 14 రేడియల్‌ రోడ్లున్నాయి. వీటికి 12 జాతీయ రహదారులతో కనెక్టివిటీ ఉంది. వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకొకటి చొప్పున ఫార్మా విలేజ్‌లను అభివృద్థి చేస్తాం. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా కాలుష్యం లేకుండా, పరిశ్రమలతో పాటు స్కూల్స్‌, ఆస్పత్రులు, అన్ని మౌలిక సదుపాయాలుండేలా వీటిని అభివృద్ధి చేసే ప్రణాళికలను మా ప్రభుత్వం రూపొందిస్తోంది. తెలంగాణలో ఐటీ, ఫార్మా, హెల్త్‌తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్పోర్ట్స్‌, ఆటోమొబైల్‌, ఆర్గానిక్‌ క్లస్టర్లుగా పరిశ్రమల ఏర్పాటు జరగాలి. రక్షణ రంగం, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలున్నాయి. పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలి. సోలార్‌ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తాం’’ అని వివరించారు.

24 గంటలు అందుబాటులో ఉంటా

ఎన్నికలు-రాజకీయాలు.. అభివృద్ధి వేర్వేరని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు. దార్శనికతతో పారదర్శకమైన అభివృద్ధే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిశ్రమల వృద్ధికి సహకరించదన్న అపోహాలు అవసరం లేదని, ఎవరికి వారుగా తమకున్న అభిప్రాయాలు ఇతరులపై రుద్దవద్దని హితవు పలికారు. రోజులో 24 గంటలూ తాను సచివాలయంలో లేదా క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానని, తనతో మాట్లాడి.. నిర్ణయాలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను కోరారు. తమతో, ప్రభుత్వ ప్రతినిధులైన అధికారులతో మాట్లాడకుండానే తొందరపడి ఒక అభిప్రాయానికో, నిర్ణయానికో రావద్దని విజ్ఞప్తి చేశారు. యువతీ యువకుల్లో నైపుణ్యతను పెంపొందించేందుకు స్కిల్‌ యూనివర్సిటీలను నెలకొల్పుతామన్నారు.

వెల్‌స్పన్‌ రూ.250 కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్‌స్పన్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఆ కంపెనీ చైర్మన్‌ బీకే గోయెంకా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. గోయెంకా మాట్లాడుతూ.. తమ కంపెనీ చందన్‌వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవల్లో భవిష్యత్తులో రూ.250 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పారు. ద్వితియశ్రేణి నగరాల్లో ఐటీని అభివృద్ధి చేసేందుకు.. వికారాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 03:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising