Tamilisai: తమిళిసై సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్.. ఐపీ అడ్రస్‌లు గుర్తించిన పోలీసులు
ABN, Publish Date - Jan 19 , 2024 | 09:15 PM
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundararajan) ఎక్స్ అకౌంట్(X) హ్యాక్‌కి గురైనట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundararajan) ఎక్స్ అకౌంట్(X) హ్యాక్‌కి గురైనట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం మూడు ఐపీ అడ్రస్‌లను గుర్తించారు.
ఐపీ అడ్రస్‌ల ద్వారా వివరాలు పంపాలని ఆయా సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. పూర్తి సమాచారం అందగానే నిందితులను పట్టుకుంటామని సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు. ఇటీవలే ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) ఎక్స్, ఇన్ స్టా అకౌంట్లు హ్యాక్‌కి గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె గురువారం సోషల్ మీడియా వేదికగా వివరించారు.
Updated Date - Jan 19 , 2024 | 09:16 PM