Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య క్షేత్రంలో జీవీపీఆర్ ఇంజనీరింగ్స్ చైర్మన్ వీరారెడ్డి
ABN, Publish Date - Jan 22 , 2024 | 06:02 PM
అయోధ్య, జనవరి 22: అయోధ్యలో సోమవారం(జనవరి 22, 2024)న జరిగిన బాల రాముడు ప్రతిష్ఠాపన కార్యక్రమానికి జీవీపీఆర్ ఇంజనీర్స్ చైర్మన్ వీరారెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. భవ్య మందిరంలో కొలువుదీరిన నీలిమేఘశ్యాముడిని దర్శించుకుని తరించారు. రామయ్యను దర్శించుకోవడంతో తమ జన్మ ధన్యం అయ్యిందని జీవీపీఆర్ ఇంజనీర్స్ చైర్మన్ వీరారెడ్డి అన్నారు.
అయోధ్య, జనవరి 22: అయోధ్యలో సోమవారం(జనవరి 22, 2024)న జరిగిన బాల రాముడు ప్రతిష్ఠాపన కార్యక్రమానికి జీవీపీఆర్ ఇంజనీర్స్ చైర్మన్ వీరారెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. భవ్య మందిరంలో కొలువుదీరిన నీలిమేఘశ్యాముడిని దర్శించుకుని తరించారు. రామయ్యను దర్శించుకోవడంతో తమ జన్మ ధన్యం అయ్యిందని జీవీపీఆర్ ఇంజనీర్స్ చైర్మన్ వీరారెడ్డి అన్నారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం అందుకున్న జీవీపీఆర్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్&ఎండీ వీరారెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లారు. ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రామయ్యను దర్శించుకున్నారు. భారతీయుల 5 శతాబద్ధాల నాటి కల నేడు సాకారమైందని, రామయ్యను దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు.
Updated Date - Jan 22 , 2024 | 06:02 PM