ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana: దారుణం.. స్కూటీతో వెంబడించి మరీ విద్యార్థిని జుట్టుపట్టి ఈడ్చిన కానిస్టేబుల్స్..!

ABN, Publish Date - Jan 24 , 2024 | 09:35 PM

Telangana Govt GO 55 Issue: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి ఈడ్చారు మహిళా కానిస్టేబుల్స్. స్కూటీపై వెళ్తూ.. పరుగెడుతున్న విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగారు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం. Agriculture University

Telangana Police

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి ఈడ్చారు మహిళా కానిస్టేబుల్స్. స్కూటీపై వెళ్తూ.. పరుగెడుతున్న విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగారు. దాంతో విద్యార్థిని కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు విద్యార్థులు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 55ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలకు ఏబీవీపీ మద్ధతు ప్రకటించి, నిరసనలో పాల్గొంది. అయితే, నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అతిగా ప్రవర్తించారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని పరుగెడుతుండగా.. వెనుక నుంచి స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ ఆమె జుట్టు పట్టి లాగారు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. యువతి జుట్టుపట్టి లాగిన కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Jan 24 , 2024 | 10:25 PM

Advertising
Advertising