ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IIT: హైదరాబాద్‌లో నేడు, రేపు ఇన్వెంటివ్-2024

ABN, Publish Date - Jan 19 , 2024 | 07:43 AM

సంగారెడ్డి జిల్లా: కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో శుక్ర, శనివారాల్లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ ప్రారంభంకానున్నది. ఈ ఇన్వెంటివ్ - 2024 కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

సంగారెడ్డి జిల్లా: కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో శుక్ర, శనివారాల్లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ ప్రారంభంకానున్నది. ఈ ఇన్వెంటివ్ - 2024 కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. దేశంలోని పలు ఐఐటీ, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటిలకు చెందిన విద్యార్థుల ఆవిష్కరణల ప్రదర్శన జరగనుంది. ఈ ఫెయిర్‌లో 23 ఐఐటీలు, బెంగళూరులోని ఐఐసీ, ఐఐఐటీలు, ఎన్‌ఐటీలు పాల్గొననున్నాయి.

వైద్యం, వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, రక్షణ, అంతరిక్షం, పరిశ్రమలు, సుస్థిరమైన టెక్నాలజీ అంశాల్లో 53 సాంకేతిక విద్యా సంస్థలు తమ 120 నూతన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. ఈ ఫెయిర్‌కు దేశంలోని 2వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీ విద్యా సంస్థలు తమ కొత్త ఆవిష్కరణలను ఈ సెంటర్‌లో ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమానికి ఐఐటీ హైదరాబాద్‌ గవర్నింగ్‌ బాడీ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఐఐటీ డైరెక్టర్‌ మూర్తి తదితరులు పాల్గొంటారు.

Updated Date - Jan 19 , 2024 | 07:43 AM

Advertising
Advertising