ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manchiryāla- 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి

ABN, Publish Date - Jan 03 , 2024 | 10:40 PM

జీవో 317 ద్వారా జరిపిన బదిలీల్లో స్థానికతను కోల్పోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని 317 జీవో బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామికి వినతిపత్రం అందించారు.

వినతిపత్రం అందజేస్తున్న 317 జీవో బాధితులు

ఏసీసీ, జనవరి 3 : జీవో 317 ద్వారా జరిపిన బదిలీల్లో స్థానికతను కోల్పోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని 317 జీవో బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామికి వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బాధితులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించి, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీఓను జారీ చేసి బదిలీలు చేపట్టిందన్నారు. లోపభూయిష్టమైన జీవో వల్ల తాము స్థానికతను కోల్పోయి ఇతర జిల్లాలు, జోన్లకు బలవంతంగా బదిలీ అయ్యామన్నారు. ఈ జీవోతో తమకు నష్టం జరిగిందని ఎన్నిసార్లు విన్నవించినా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విజయ్‌ కుమార్‌, మధుసూదన్‌ రెడ్డి, హరి, స్వరూప, దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 10:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising