ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

ABN, Publish Date - Jan 09 , 2024 | 12:30 AM

నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ అఖిల్‌మహాజన్‌ అన్నారు. సోమవారం సాయంత్రం తంగళ్లపల్లి మండలం మండెపల్లి కేసీఆర్‌నగర్‌లో పోలీసులు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.

మాట్లాడుతున్న ఎస్పీ అఖిల్‌హాజన్‌

తంగళ్లపల్లి, జనవరి 8 : నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ అఖిల్‌మహాజన్‌ అన్నారు. సోమవారం సాయంత్రం తంగళ్లపల్లి మండలం మండెపల్లి కేసీఆర్‌నగర్‌లో పోలీసులు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్‌ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రిచ వచ్చన్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని, గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువత అసాంఽఘీక కార్యాకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని అన్నారు. వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళలకు, బాలికలకు ఏమైనా ఇబ్బందులు తలేత్తితే డయల్‌ 100, షీటీమ్‌కు సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, సీఐ సదన్‌కుమార్‌, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:30 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising