ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి అవసరం

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:33 AM

గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని ఎంపీపీ ఆరెల్లి దేవక్క సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ ఆరెల్లి దేవక్క

- ఎంపీపీ ఆరెల్లి దేవక్క

రామగిరి, జనవరి 10: గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని ఎంపీపీ ఆరెల్లి దేవక్క సూచించారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సభ్యులు అదికారుల దృష్టికి తీసుకెళ్లారు. బేగంపేట్‌ గ్రామంలో విద్యుత్‌ లూజ్‌ లైన్స్‌ను పునరుద్ధరించాల్సిందిగా స్థానిక ఎంపీటీసీ కరుణ సమావేశంలో వెల్లడించారు. మండలం కేంద్రం లో అసంపూర్తిగా ఉన్న మిషన్‌భగీరథ పనులతో పాటు, చేసిన పనులకు సంబందించి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని, స్థానిక సర్పంచ్‌ అల్లం పద్మ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సర్వసభ్య సమావేశానికి కొన్ని విభాగాలకు చెందిన అధికారులు గైర్హాజరు కావడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశానికి అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, లేని పక్షంలో మండల పరిషత్‌ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సభ్యులు వెల్లడించే సమస్యల పరిష్కారంలో ఆయా విభాగాలకు చెందిన అధికారులు పాత్ర కీలకమని వానే సభకు గైర్హాజరు అయితే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. అనంతరం వివిధ శాఖలకు సంబందించిన మినిట్స్‌ను చదివి వినిపించారు. సమావేశంలో ఎంపీడీవో రమేశ్‌, డిప్యూటి తహసీల్దార్‌ రాకేష్‌, సింగిల్‌విండో చైర్మన్‌ భాస్కర్‌రావు, ఎంపీటీసీ లు, సర్పంచ్‌లు, వివిధ విభాగల అదికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:33 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising