ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:41 PM

ఐసీడీఎస్‌, అంగన్‌వాడీ ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే అఖిలభారత సమ్మెలో మంథని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రాజెక్టు కమిటీ పిలుపునిచ్చింది.

గణేశ్‌నగర్‌,జనవరి 30 : ఐసీడీఎస్‌, అంగన్‌వాడీ ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే అఖిలభారత సమ్మెలో మంథని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రాజెక్టు కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా మంథని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారిణికి సమ్మెనోటీసు మంగళవారం ఆందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి వనజారాణి జి జ్యోతి, సహాయ కార్యదర్శి టి కృష్ణకుమారి నాయకులు బూడిద గణేష్‌ సందీప్‌, ప్రాజెక్టు నాయకులు సుగుణ శోభ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ 60 శాతానికి తగ్గించారన్నారు. దీనివల్ల ఐసిడిఎస్‌ బలహీన పడిందన్నారు. దీంతో అంగన్వాడీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రావడం లేదన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించడం లేదని తెలిపారు. నాణ్యమైన ఆహారం ప్రజలకు అందడం లేదన్నారు. ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సిఫార్సులను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఐసీడీఎస్‌ బడ్జెట్‌ పెంచి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమ్మెలో జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులందరూ పాల్గొనాలని జిల్లా కమిటీ పిలుపునిస్తోందన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:41 PM

Advertising
Advertising