ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్కాన్‌ చేస్తే పాఠం..

ABN, Publish Date - Feb 01 , 2024 | 11:31 PM

విద్యార్థులకు బోధనలో నూత న సాంతేతికత పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

విద్యార్థులకు డిజిటల్‌ పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే యెన్నం (ఫైల్‌)

- పదిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్ఠి

- పదోతరగతి విద్యార్థులకు త్రీడీలో పాఠాలు అవగతం

- నియోజకవర్గంలో 2,500 మంది విద్యార్థులకు డిజిటల్‌ పుస్తకాలు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం ఫిబ్రవరి 1 : విద్యార్థులకు బోధనలో నూత న సాంతేతికత పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పదో తరగతిలో విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించేందుకు ఎమ్మెల్మే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలకు 47 రోజల గడువు ఉన్నందున విదార్థులు ఒత్తిడికి లోనుకాకుండా సులభంగా అర్థం చేసుకునే విధంగా డిజిటల్‌ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పుస్తకంపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ ఫోన్‌తో స్కాన్‌ చేస్తే యూట్యూబ్‌లో బోధన, చిత్రాలు కనిపిస్తాయి. ఎమ్మెల్యే స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీఎం రేవంత్‌రెడ్డి చిరుకానుక పేరుతో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశా లల్లో పదో తరగతి చదివే 2,500 మంది విద్యార్థులకు డిజిటల్‌ కంటెంట్‌ స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది

మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన ‘సీఎం రేవంత్‌రెడ్డి చిరుకానుక’ కార్యక్రమంతో పదో తరగతి విద్యార్థులకు ఏంతో మేలు జరుగు తుంది. గతంలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విని నేర్చుకున్న అంశాలను గుర్తు పెట్టుకున్న దాన్ని మరోమారు నెమరు వేసుకునేందుకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడుతాయి. పదిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

- రవీందర్‌, డీఈవో మహబూబ్‌నగర్‌

Updated Date - Feb 01 , 2024 | 11:31 PM

Advertising
Advertising