ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అతి చిన్నసైజులో రాములోరి పాదుకల తయారీ

ABN, Publish Date - Jan 20 , 2024 | 11:54 PM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన స్వర్ణకారుడు చొల్లేటి శ్రీనివాసచారి అతిచిన్న రాములోరి పాదుకలను తయారు చేశారు.

రాములోరి అతిచిన్న పాదుకలు, తయారు చేసిన స్వర్ణకారుడు శ్రీనివాసచారి

నార్కట్‌పల్లి, జనవరి 20: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన స్వర్ణకారుడు చొల్లేటి శ్రీనివాసచారి అతిచిన్న రాములోరి పాదుకలను తయారు చేశారు. అయోధ్యలో చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 22న జరిగే బాలరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ, రామ మందిర ప్రారంభోత్సవ పుణ్యకార్యాన్ని పురస్కరించుకుని తయారు చేసినట్లు తెలిపారు. రెండు పాదుకలను కేవలం 0.130 మిల్లీ గ్రాముల బంగారాన్ని వినియోగించి 8 మిల్లీమీటర్‌ సైజు పొడవు, 4మిల్లీమీటరు సైజు వెడల్పుతో తయారు చేసినట్లు తెలిపారు. వీటిని తయారు చేయడానికి కేవలం గంట మాత్రమే సమయం పట్టిందని తెలిపాడు. కాగా గతంలో కూడా బతుకమ్మ, రాకెట్‌ నమూనా, జాతీయ పతాకం, శివలింగం, భారతదేశ పటం వంటి వాటిని అతి చిన్నసైజు పరిమాణంలో తయారు చేసి పలువురి మన్ననలు పొందాడు.

Updated Date - Jan 20 , 2024 | 11:54 PM

Advertising
Advertising