మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajagopal Reddy: నాకు తెలీకుండా దొంగచాటున పోయి కండువా కప్పుకున్నాడు

ABN, Publish Date - Feb 17 , 2024 | 08:02 PM

తాము చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు తెలియకుండా కావాలని దొంగచాటున పోయి ఆయన కండువా కప్పుకున్నాడని అన్నారు. దీపా దాస్‌మున్సికి తెలీకుండా లైన్‌లో నిలబడి.. కృష్ణారెడ్డి కండువా కప్పించుకున్నారని చెప్పారు.

Rajagopal Reddy: నాకు తెలీకుండా దొంగచాటున పోయి కండువా కప్పుకున్నాడు

తాము చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు తెలియకుండా కావాలని దొంగచాటున పోయి ఆయన కండువా కప్పుకున్నాడని అన్నారు. దీపా దాస్‌మున్సికి తెలీకుండా లైన్‌లో నిలబడి.. కృష్ణారెడ్డి కండువా కప్పించుకున్నారని చెప్పారు. తనపై ఆయన పోటీ చేశారని.. అలాంటిది తనకు తెలియకుండా కాంగ్రెస్‌లో ఎలా జాయిన్ అవుతారని ప్రశ్నించారు. కృష్ణారెడ్డి తనపై చాలా నోరు పారేసుకున్నారని.. ఆయన మానిప్యులేటర్ & మోసపూరితమైన వ్యక్తి అని ఆరోపించారు. కృష్ణారెడ్డి లాంటి మైండ్‌సెట్ ఉన్న వ్యక్తులు రాజకీయాలకు ఏమాత్రం పనికిరారని తూర్పారపడ్డారు. ఆయన్ను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.


ఇక మునుగోడు ఉప ఎన్నికతో రూ.6 వందల కోట్ల అభివృద్ధి జరిగిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను బీజేపీలో ఉంటే కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌లో ఉంటే బీజేపీకి డిపాజిట్ రాలేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మూడు సీట్లు బీసీలకు ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు. సికింద్రాబాద్, జాహిరాబాద్‌, భువనగిరి సీట్లను బీసీలకు ఇచ్చి గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గాదరి కిషోర్‌పై మందుల సామేల్‌ను గెలిపించామని.. ఏడాది క్రితమే ఈసారి నువ్వు గెలుస్తున్నామని తాను సామేల్‌కు చెప్పానని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కచ్ఛితంగా 10 సీట్లు వస్తాయని నమ్మకం వెలిబుచ్చారు. పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తామని ఉత్తమ్ కుమార్ హామీ ఇవ్వలేదని, ఏఐసీసీ ఇచ్చినట్లు తనకు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు.

Updated Date - Feb 17 , 2024 | 08:02 PM

Advertising
Advertising