ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సర్పంచలపై వరుసగా ఆరోపణల పర్వాలు

ABN, Publish Date - Jan 27 , 2024 | 11:22 PM

మండలంలో పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేశారంటూ సర్పంచలపై ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి.

పెదవీడు సర్పంచపై ఫిర్యాదు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

మఠంపల్లి, జనవరి 27 : మండలంలో పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేశారంటూ సర్పంచలపై ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి. మఠంపల్లి పంచాయతీలో రూ.74,84,826లు నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు మేరకు ఈ నెల 20న గ్రామకార్యదర్శి శ్రీకాంతరెడ్డిపై సస్పెన్షన వేటు వేయగా, ఈ నెల 23న సర్పంచ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి చెక్‌పవర్‌ రద్దు చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా పెదవీడు సర్పంచపై అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా శనివారం బీల్యానాయక్‌తండా పంచాయతీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగుస్తున్న తరుణంలో తమతో కలిసి పనిచేసిన వారే అభియోగాలు, ఫిర్యాదులు చేయడం సర్పంచలను కలవరానికి గురిచేస్తోంది. కాంగ్రె్‌సపార్టీ నేతన ఒత్తిళ్లతోనే ఈ వ్యవహారం నడుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.

బీల్యానాయక్‌తండా రికార్డులు స్వాధీనం

మండలంలోని బీల్యానాయక్‌తండా పంచాయతీకి సంబంధించి చెక్‌బుక్‌, ఓచర్లు, ఎంబీ రికార్డులను కోదాడ డివిజన డీఎల్‌పీవో శ్రీరాములు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సర్పంచ బానోతు శాంతి, ఉపసర్పంచ కృష్ణ ప్రభుత్వ నిధులను అక్రమంగా డ్రా చేశారని, మూడు రోజుల కిందట స్థానికులు కలెక్టర్‌ వెంకటరావుకు ఫిర్యాదుచేశారు. సీసీ రోడ్డు నిర్మాణం, మురుగుకాల్వలు, ఆర్థికసంఘం, ఇతర అభివృద్ధి నిధులను దుర్వినియోగం చేశారని, విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీడీఎల్‌పీవో శ్రీరాములు విచారణకు రాగా పంచాయతీ వద్ద పెద్దసంఖ్యలో ప్రజలు నిరసన తెలిపి, ఆయన్ను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఆయన మండల పరిషత కార్యాలయంలో ఉండి పంచాయతీ కార్యదర్శి చంటి ద్వారా రికార్డులను తెపించుకున్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు కొందరు డీఎల్‌పీవోను కలిసి ఫిర్యాదుల విషయమై నిలదీశారు. కలెక్టర్‌ ఆదేశాలతో రికార్డులను స్వాధీనం చేసుకున్నామని డీఎల్‌పీవో వారికి వివరించారు. దీంతో వార్డు సభ్యులు, కొందరు పంచాయతీలో ఎలాంటి నిధుల దుర్వినియోగం కాలేదని, అధికారుల సూచనల మేరకు ఖర్చు చేశారని డీఎల్‌పీవోకు రాతపూర్వకంగా విన్నవించారు. శ్రీరాములు వెంట ఎంపీడీవో జానకిరాములు, ఎంపీవో ఆంజనే యులు, తదితరులు ఉన్నారు.

పెదవీడు సర్పంచపై ఫిర్యాదు

మఠంపల్లి, బీల్యానాయక్‌తండా సర్పంచలు బీఆర్‌ఎస్‌ వారు కాగా వారిపై అధికారులు చర్యలకు సిద్ధమైన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన పెదవీడు సర్పంచ సయ్యద్‌ బీబీకుతూబ్‌పై బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ, వార్డు సభ్యులు అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి ఫిర్యాదుచేశారు. పెదవీడు సర్పంచ, కార్యదర్శి లక్ష్మణ్‌ 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.2 కోట్లు దుర్వినియోగం చేశారని ఎంపీటీసీ కుందూరు వెంకటరెడ్డి, వార్డు సభ్యులు షేక్‌ నబీ, షేక్‌ జుబేదా మహ్మద్‌, బూడిగ వెంకటేశ్వర్లు, మద్దుల నాగరాజు, మొగిలి మట్టయ్య, రెడపంగు నాగరాజు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు చిలక దేవభిక్షం శనివారం ఫిర్యాదుచేశారు.

ఆర్థిక సంఘం నిధులతో పాటు సాగర్‌, నాగార్జున సిమెంట్‌ పరిశ్రమల మినరల్‌ ఫండ్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారని, పాలకవర్గం సభ్యుల తీర్మానం లేకుండానే నిధులను డ్రా చేసి దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Updated Date - Jan 27 , 2024 | 11:22 PM

Advertising
Advertising