ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పార్లమెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లుచేయాలి

ABN, Publish Date - Jan 24 , 2024 | 12:23 AM

పార్లమెంట్‌ ఎన్నికలకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పంకజ్‌, సంతోష్‌ అన్నారు.

వీడియోకాన్ఫరెన్సలో పాల్గొన్న కలెక్టర్‌ వెంకటరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, ప్రియాంక

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పంకజ్‌, సంతోష్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 23 : పార్లమెంట్‌ ఎన్నికలకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పంకజ్‌, సంతోష్‌ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీ నుంచి వీడియయోకాన్ఫరెన్సలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. కోడ్‌ ఉండే సమయంలో నగదు తరలింపు, మద్యం, ఇతరత్రా వస్తువుల క్రయవిక్రయాలపై నిఘా ఉంచాలన్నారు. గత ఎన్నికల్లో రూపొందించిన క్యూఆర్‌కోడ్‌ను లక్షా 38వేల మంది వినియోగించుకున్నారని, త్వరలో ఈ-యా్‌పను మరింత అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అదనపు కలెక్టర్లు సీహెచ ప్రియాంక, వెంకట్‌రెడ్డి, ఎంఎంసీ నోడల్‌ అధికారి సతీ్‌షకుమార్‌, ఎఫ్‌ఎ్‌సటీఎ్‌సఎ్‌సటీ బృందాలు పాల్గొన్నాయి.

వేసవిలో నీటిఎద్దడి నివారణకు చర్యలు

వేసవిలో జిల్లాలో ఎక్కడా నీటిఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మిషన భగీరథ నీటి సరఫరాపై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ సీహెచ ప్రియాంక, సీఈ చెన్నారెడ్డితో కలసి మాట్లాడారు. భగీరథకు సంబంధించి 22 సమస్యలను గుర్తించామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా కనెక్షన్లు, పైప్‌ డ్యామేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. మిగిలిన 8 పనులను ఫిబ్రవరి చివరినాటికి పూర్తిచేయాలన్నారు. వేసవికి జిల్లాలో ప్రతీ ఇంటికి భగీరథ నీరు అందాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీఈవో సురేష్‌, ఈఈ అరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, డీపీవో యాదయ్య, ఎంపీడీవోలు ఎంపీవోలు పాల్గొన్నారు.

ఇంటి పన్ను నూరుశాతం పూర్తి చేయాలి

గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నులను నిర్ధేశించిన సమయంలోపు నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటరావు ఆదేశించారు. ఇంటిపన్ను వసూళ్లపై కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ప్రియాంకతో కలసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటిపన్నులు ఇప్పటివరకు కేవలం 50శాతం పూర్తి చేశారని, ఫిబ్రవరి 10వ తేదీలోపు నూరుశాతం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఫిబ్రవరిలో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నాటిని ప్రతి మొక్కకూ నీటిని అందించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేష్‌. డీఆర్‌డీవో పీడీ సుందరి కిరణ్‌కుమార్‌, డీపీవో యాదయ్య, ఎంపీడీవోలు, ఎంపీవోలు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2024 | 12:23 AM

Advertising
Advertising