ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అభివృద్ధి కావాలంటే బెల్ట్‌షాపులు మూయాల్సిందే

ABN, Publish Date - Jan 25 , 2024 | 12:06 AM

గ్రామాల్లో అభివృద్ధి పనులు కావాలంటే బెల్ట్‌షాపులు మూయాల్సిందేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

మునుగోడు రూరల్‌, జనవరి 24 : గ్రామాల్లో అభివృద్ధి పనులు కావాలంటే బెల్ట్‌షాపులు మూయాల్సిందేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొంపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన సహకారంతో రూ.30 లక్షలతో నిర్మించిన తరగతి గదులను ఫౌండేషన చైర్మన కోమటిరెడ్డి లక్ష్మితో కలిసి ప్రారంభించారు. మరో మూడు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజల చేశారు. అనంతరం మండలంలోని ఊకొండి గ్రామ ంలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎందరో మహిళా తల్లులు కోరిన మాట ప్రకారమే బెల్ట్‌షాపుల మూసివేత నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఊకొండిలో మద్యానికి బానిసై ఐదుగురు కుమారులు తాగుడుకు బానిసలయ్యారని బుచ్చమ్మ అనే మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. స్పందించిన ఎమ్మెల్యే బెల్ట్‌షాపులు మూసివేయాలని మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నారాబోయిన రవిముదిరాజ్‌, సర్పంచలు జాల వెంకన్న, నడింపల్లి యాదగిరి, ఎంపీటీసీ విజయలక్ష్మి, సైదులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బీమనపల్లి సైదులు, బొజ్జ శ్రీనివా్‌సరెడ్డి, వేదిర మేగారెడ్డి, వట్టి కోటి శేఖర్‌, మాజీ ఎంపీపీ మేడి నాగలక్ష్మి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఊకొండి గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 12:06 AM

Advertising
Advertising