ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈడీ చూపు ఇండియా కూటమి నేతలపైనే

ABN, Publish Date - Feb 02 , 2024 | 12:04 AM

ఈడీ చూపు కేవలం ఇండియా కూటమి నేతలపైనే ఉందని, లక్షలకోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌ కనిపించడం లేదా అని తీన్మార్‌ మల్లన్న అన్నారు. ఓటర్‌ నమోదుపై పట్టభద్రులకు అవగాహన కల్పించేందుకు బుధవారం ఇక్కడికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటుహక్కును నమోదు చేసుకోవాలి

బీజేపీ, బీఆర్‌ఎ్‌సది చీకటి ఒప్పందం

తీన్మార్‌ మల్లన్న

మిర్యాలగూడ, ఫిబ్రవరి 1: ఈడీ చూపు కేవలం ఇండియా కూటమి నేతలపైనే ఉందని, లక్షలకోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌ కనిపించడం లేదా అని తీన్మార్‌ మల్లన్న అన్నారు. ఓటర్‌ నమోదుపై పట్టభద్రులకు అవగాహన కల్పించేందుకు బుధవారం ఇక్కడికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టభద్రులకు ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తూ దరఖాస్తు ఫారాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్‌ అవినీతిపై అనేక ఫిర్యాదులున్నా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్‌ది చీకటి ఒప్పందాలని ఆరోపించారు. లిక్కర్‌ స్కాంలో కవిత అరె్‌స్టపై బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తోందో ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. చీకటి స్నేహాలు చేసేవారికి ఒక నీతి, తప్పులను ఎత్తి చూపేవారిపై మరో రీతిన కేంద్ర పాలకులు వ్యవహరించడం తగదన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాం గ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు బీఆర్‌ఎ్‌సకు అభ్యర్థులే కరువయ్యారని అన్నారు. దళితులను కేసీఆర్‌ మోసం చేశారన్నారు. నల్లగొండ, వరంగల్‌ ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నిక జరగనున్నందున ఈ నెల 6లోపు పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు పొదిల శ్రీనివాస్‌, తమ్మడబోయిన అర్జున్‌, దేశిడి శేఖర్‌రెడ్డి, జలంధర్‌రెడ్డి, సిద్దూనాయక్‌, చలపతిరావు, సురేష్‌, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:04 AM

Advertising
Advertising