ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుర్తించి..బడిలో చేర్పించి

ABN, Publish Date - Jan 28 , 2024 | 11:28 PM

బాలల భవితకు, చదువుకునేందుకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. విద్యా లక్ష్యాలను చేరేందుకు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ దుకా ణాలు, పలు హోటళ్లు, నిర్మాణ రంగం, కర్మాగారాల్లో పనిచేసే బడి ఈడు పిల్లలను (బాలబాలికలు) గుర్తి ంచి బడిలో చేర్పిస్తున్నారు.

గుండాల మండలంలో ఇటుకబట్టీల వద్ద బడి ఈడు పిల్లల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఆర్పీ లింగయ్య (ఫైల్‌)

ఈ నెల 31 వరకు అవకాశం

యజమానులదే చదివించే బాధ్యత

బడి ఈడు పిల్లలను గుర్తించే పనిలో విద్యా శాఖ

భువనగిరి అర్బన, జనవరి 28 : బాలల భవితకు, చదువుకునేందుకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. విద్యా లక్ష్యాలను చేరేందుకు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ దుకా ణాలు, పలు హోటళ్లు, నిర్మాణ రంగం, కర్మాగారాల్లో పనిచేసే బడి ఈడు పిల్లలను (బాలబాలికలు) గుర్తి ంచి బడిలో చేర్పిస్తున్నారు. బడి బయట పిల్లలను పాఠశాలల్లోనే ఉండాలనే సదుద్దేశ్యంతో ఏటా చదువుకు దూరంగా అలాగే దూరమతున్న పిల్లలను పసిగట్టే సర్వే చేస్తూ అందుకు అనుగుణంగా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గతేడాది డిసెంబరు 11న మొదలైన ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన కార్యక్రమం ఈ నెలాఖరు వరకు జిల్లాలో కొనసాగనుంది. ఒక విద్యా సంవత్సరం ముందుగానే ఈ కార్యక్రమం నిర్వహించి బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం జరుగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి తెలిపారు..

వర్క్‌సైట్‌ పాఠశాలలు

కర్మాగార, నిర్మాణ, ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేసేందుకు, ఉపాధినిమిత్తం కార్మిక కుటుంబాలు వలస పోతుంటాయి. ఈ క్రమంలో వారితో పాటే పిల్లలూ వెళ్తుంటారు. స్థానిక భాష రాకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీల పిల్లలు, ఇతరులు మరికొందరు ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. అలా ంటి వారి కోసమే పనులు చేస్తున్న చోట యాజమానులే చదువు చెప్పించేందుకు వలస కార్మికుల పిల్లల సౌకర్యార్థం వర్క్‌సైట్‌ పాఠశాలలు, బోధకులను ఏర్పా టుచేసుకొని అవసరమైన విద్యా సామాగ్రిని అందించేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. అలా వీలుకాని పక్షంలో దగ్గరలోని సమీప ప్రభుత్వ పాఠశాలలో యజమానులే చేర్పించాలి. ఆ దిశగా చొరవ చూపుతున్న సందర్భాలు కొన్నే ఉండగా మరికొన్ని చోట్ల బోధకుడి గౌరవ వేతనం అందించేలా కృషి చేస్తున్నారు. ఏటా బాలల భవిష్యత్తు దృష్ట్యా బడిలో చేర్పించేందుకు, వర్క్‌సైట్‌ పాఠశాలలు ఏర్పాటుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో కేవలం వర్క్‌సైట్‌ పాఠశాలలు భూదానపోచంపల్లిలో ఐదు చోట్ల ప్రస్తుతం నడు స్తున్నాయని డీఈవో నారాయణరెడ్డి తెలిపారు.

బడి ఈడు పిల్లలు 1,759మంది

ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా 1,759 మంది బడిబయట పిల్లలను గుర్తించగా ప్రస్తుతం విద్యాశాఖ వివరాల ప్రకారం 844 మంది వలస కార్మికుల పిల్లలను బడిలో చేర్పించగా కొన్నిరోజులు అభ్యసించి తల్లిదండ్రులతో కలిసి స్వరాష్ట్రానికి వెళ్లారు. కాగా, మిగతా 915మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో పాఠశాలల్లో చేరే పరిస్థితి లేకపోతే సమగ్ర శిక్ష నుంచి బోధన రుసుం సమకూర్చుతారు. పోలీసు, కార్మిక, వైద్యారోగ్య, ఐసీడీఎస్‌, ఇతర శాఖల సమన్వయంతో కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోందని జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ సమగ్ర అఽధికారి శ్రీనివాస్‌ చెప్పారు.

బడి బయట పిల్లలు...

సంవత్సరం 6 నుంచి 14 15 నుంచి 19 వలస కార్మికుల..

2022-23 735 32 ----

2023-24 63 04 594

2024-25 66 15 250

మొత్తం 864 51 844

సీఆర్‌పీలతో సర్వే

ప్రభుత్వం చేపట్టిన సర్వేలో భాగంగా 6-14, 15-19ఏళ్ల వయస్సు పిల్లల వివరాలు సేకరిస్తారు. బడి బయట పిల్లలే కాక ఏకారణం చేతనైనా 30 రోజులుగా బడికి రాని పిల్లలను గుర్తించి తద్వారా బడి బయటి విద్యార్థిగా నిర్ధారణకు వస్తారు. జిల్లాలో 50 క్లస్టర్లు ఉండగా 58మంది సీఆర్పీ(కాంప్లెక్స్‌ రిసోర్స్‌పర్సన)లు సర్వే చేపట్టారు. సర్వే ముగిసిన తదుపరి ఎంఈవోలు వారి ప్రాంతాల్లో బడి బయట పిల్లలను ధ్రువీకరిస్తూ ఆ వివరాలను జిల్లా విద్యాధికారికి సమర్పించాలి. పదో తరగతి ముగిసిన విద్యార్థులు ఇంటర్‌ విద్యను ఖచ్చితంగా అభ్యసించాలి. ఒకవేళ చదువు మధ్యలోనే మానేస్తే సార్వత్రిక పాఠశాలల్లో నమోదయ్యేలా చర్యలు చేపడుతారు. ఈ వివరాల సేకరణలో సీఆర్పీలు కీలకపాత్ర పోషిస్తున్నారు.

పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలి

వలస కార్మికుల పిల్లలతో పాటు బడి బయటి ఉండే బడి ఈడు పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన్స కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. సర్వే పక్కాగా చేపడుతున్నాం. పిల్లలను పనుల్లోకి పంపకుండా బడికి పంపి వారి జీవితాలకు దారి చూపాలి. గుర్తించిన బడి బయట పిల్లలను బడిలో చేర్పిచేందుకు చర్యలు చేపడుతున్నాం. 2024-25సంవత్సరానికి ఇప్పటికి 250మంది పిల్లలను బడిలో చేర్పించాం.

- కే నారాయణరెడ్డి, డీఈవో

Updated Date - Jan 28 , 2024 | 11:28 PM

Advertising
Advertising